చిత్తూరు జిల్లా గుడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు టిడిపి అధినేత చంద్రబాబు బయలుదేరారు. పార్టీ కార్యాలయానికి వెళ్లనీయకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ నడిరోడ్డుపై  చంద్రబాబు నిరసనకి దిగారు. గుడిపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డుపైనే ఎండలో నేలపై బాబు బైఠాయించారు. తరువాత చంద్రబాబు ఒక బస్సు తెప్పించి, స్వయంగా నుచ్చెన వేసుకుని బస్సు పైకి ఎక్కారు. ఆ వయసులో చంద్రబాబు అలా బస్సు ఎక్కి ప్రసంగిస్తారని, పోలీసులు ఊహించలేక పోయారు. తరువాత చంద్రబాబు బస్సు పై నుంచే మాట్లాడారు.  గుడిపల్లికి ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటారా? అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కార్యకర్తలు రాకుండా బారికేడ్లు పెడతారా? అని నిలదీశారు. బానిసలుగా బతకొద్దని, నన్ను పంపియాలని చూస్తే మిమ్మల్నే పంపిస్తానని హెచ్చరించారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని పోలీసులకి హితవు పలికారు. వైసీపీ నేతలు రోడ్డుషోలు, సభలు పెట్టొచ్చు కానీ టిడిపి పెట్టకూడదా అని నిలదీశారు. వైసీపీ వాళ్లకు ఒక రూలు.. మాకో రూలా? ఇదేం చట్టం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read