శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అప్పట్లో ప్రజలను అయోమయానికి చిరంజీవి గురి చేశారని,అనంతరం కేం ద్రంలో మంత్రి పదవిని సైతం పొందారని గుర్తు చేశారు. విభజన సమస్యలపై కూడా పెదవి విప్పడం లేదన్నారు. ఇప్పుడేమో పొంతన లేని రాజకీయాలతో ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ వచ్చారన్నారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి రాజకీయం ఒక్కో విధంగా సాగుతోందని, రా ష్ట్ర ప్రజలను విస్మరించడం తనకు బాధ కలిగిస్తోందని తెలిపారు. వేరే రాష్ట్రాలలో అయితే రాష్ట్ర సమస్యలపై అన్ని పార్టీలు ఒక్కటిగా మార తాయని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా వుండ టం శోచనీయమని అన్నారు. వైఎస్సార్‌సిపి కేసుల కోసం కేంద్రంతో రాజీ పడుతోం దని, లోపల విశ్వాసంగా వుంటూ , బయటకు మాత్రం అవిశ్వాసాన్ని ప్రకటిస్తోందంటూ దుయ్యబట్టారు.

cbn 1507208 2

కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటుందని చెప్పడం, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి నాయకుల్ని మళ్లీ పార్టీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి స్పందన కోరగా... ‘‘కాంగ్రెస్‌ను తిట్టిన జగన్‌ చివర్లో లాలూచీపడి బెయిల్‌ తెచ్చుకున్నారు. ఇప్పుడు భాజపా దగ్గరకు వెళ్లిపోయారు. కేసుల మాఫీకే రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకి మద్దతిచ్చారు. కిరణ్‌ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. ప్రజలు ఆదరించలేదు. నాలుగేళ్లు వేచి ఉండి, కాంగ్రెస్‌లోకి వెళుతున్నారు. అది ఒక ఛాయిస్‌. పవన్‌ కళ్యాణ్‌ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. తర్వాత కాంగ్రెస్‌లో కలిపేసి, కేంద్ర మంత్రయ్యారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలీదు. కాంగ్రెస్‌లోనే ఉన్నారనుకుంటున్నాను. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సమయంలో పవన్‌ ఆ పార్టీలోనే ఉన్నారు. ఆయనా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టేమీ చెప్పలేదు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఆయనేమీ మాట్లడలేదు. ఇటీవల ఒక కమిటీ వేసి కేంద్రం రూ.70 వేల కోట్లు ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఆ విషయం మాట్లాడకుండా, నన్ను తిడుతున్నారు. కాంగ్రెస్‌ వాళ్లూ నన్ను తిడుతున్నారు. వాళ్లే సరిగ్గా చేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

cbn 1507208 3

వైఎస్సార్‌సిీపీ ఎంపీలు అసలు రాజీనామాలు చేయడమెందుకు అని ముఖ్యమంత్రి అన్నారు. అదంతా ఒక నటన మాత్రమే నన్నారు. తప్పించుకోవడానికే త్యాగం చేశామని చెబుతున్నారని చెప్పారు. వైఎస్సార్‌సిపీ, జనసేన, బీజేపీలు కలిసి టీడీపీని లక్ష్యంగా ఎంచుకున్నాయన్నారు. ఏ పార్టీ కూడా సమస్యలపై మాట్లాడటం లేదని, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసుకుని దాడి చేస్తే ప్రజలు నమ్మరన్నారు. విభజనానంతర సమస్యల విషయంలో సెంటిమెంట్‌తో ఆటలాడుకోవడం కేంద్ర ప్రభుత్వానికి తగదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. న్యాయబద్దంగా తాము, ఎం.పి.లు డిమాండ్లను గుర్తు చేస్తే తమాషా చేస్తారా అని మండిపడ్డారు. ఇది బిజెపి మార్కు రాజకీయానికి పరాకాష్ట అన్నారు. ఈ గడ్డమీద పుట్టినవాళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం విడ్డూరంగా వుందని వ్యాఖ్యానించారు. అవినీతిపరులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తారా అని ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read