అతడి వయసు 21. కానీ ఆ తల్లిదండ్రులకు పసివాడే. ప్రపంచం తెలీదు. పుట్టుకతో వైకల్యం ఉంది. ఉన్నట్లుండి వచ్చే మూర్ఛ. అనారోగ్యం. కుమారుడంటే ప్రాణం. వైద్యంతో పరిస్థితిని కొంతమేర అదుపులోకి తీసుకురావచ్చని వైద్యులు చెప్పడంతో వారు తమ బిడ్డను తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించారు. వైద్యానికి సాయం చేసి ఆదుకోవాలని కోరుతూ కన్నీరు మున్నీరయ్యారు. ముఖ్యమంత్రి తక్షణం స్పందించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం అడవితక్కెళ్లపాడు యువకుడు షేక్ జాఫర్ షరీఫ్‌కు పుట్టుకతోనే డిఫ్యూజ్ సెరిబ్రల్ ఆట్రోఫీ వ్యాధి ఉంది. తల్లిదండ్రులు బిడ్డను తీసుకువచ్చి పరిస్థితిని సీఎంకు వివరించడంతో అతడి వైద్యానికి ముఖ్యమంత్రి రూ. 5 లక్షలు మంజూరు చేశారు.

cbnhelp 30072018 2

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సరస్వతుల ఫణీంద్ర కుమారుడు చిన్నారి సరస్వతుల షణ్ముఖ కౌశిక్ కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కౌశిక్ అనారోగ్య తీవ్రతను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించి ముఖ్యమంత్రి బాలుని కాలేయమార్పిడి చికిత్సకు అయ్యే రూ.15 లక్షలు మంజూరు చేశారు. చిత్తూరు జిల్లా భవానీశంకరపురం కండ్రిగ గ్రామానికి చెందిన చెంగయ్య నాయుడు కుమారుడు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న ముప్ఫయి మూడేళ్ల సుదర్శనబాలు వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి రూ.2.5 లక్షలు మంజూరు చేశారు.

cbnhelp 30072018 3

నెల్లూరు జిల్లా బాలాయిపల్లి మండలం నడిగల్లు గ్రామస్తుడు సర్వేపల్లి రామయ్య ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో రెండు కాళ్లూ దెబ్బతిన్నాయి. పెద్ద కుటుంబం. పైగా పేదరికం. ఆయన తన సమస్యను ముఖ్యమంత్రికి వివరించగా ఆయన రూ.లక్ష సహాయం ప్రకటించారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన మునెప్ప పుట్టుకతోనే దివ్యాంగుడు. మానసికంగా దెబ్బతిని శారీరకంగా కుంగిపోయాడు. అతడికి ఎన్టీఆర్ వైద్య సేవకింద పూర్తి వైద్యం చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కుప్పం మండలం ఉర్లోబానపల్లి గ్రామం నుంచి వచ్చిన రాముడు,లక్ష్మణుడు అనే కవలలకు సాయంగా రూ.30 వేల వంతున బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read