తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టే మొత్తం జరుగుతున్నాయి. కందుకూరు, గుంటూరు ఘటనలు జగన్ స్కెచ్ అని, అవి సాకుగా చూపి, చంద్రబాబు పర్యటనలు రద్దు చేసే కుట్ర పన్నారని టిడిపి ఆరోపించింది. ఆ ఆరోపణలకు తగ్గట్టే, నిన్న సభలు, ర్యాలీలు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ రోజు నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన ఉండటంతో, మొత్తం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చంద్రబాబు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో దిగి కుప్పం రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు కుప్పం రానున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదు అంటూ, పోలీసులు ఓవర్ ఆక్షన్ చేస్తున్నారు. కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచారరథం, ఇతర వాహనాలను పోలీసులు ఆపేసారు. చిత్తూరు జిల్లా 121 పెద్దూరు గ్రామం వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టిడిపి నేతలు చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు వెళ్తున్నారు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాత్రం, ఆంక్షలు పాటించకపోతే కేసులు పెడతాం అని వార్నింగ్ ఇస్తున్నారు.
కుప్పంలో చంద్రబాబు ప్రచారం రధం, ఇతర వాహనాలు ఆపేసిన పోలీసులు.. కుప్పంలో ఉత్కంఠ...
Advertisements