తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థలం కబ్జా వ్యవహారం, రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. చంద్రబాబు సొంత ఊరు నారా వారి పల్లెలో చంద్రబాబుకు చెందిన 38 సెంట్ల స్థలంలో చంద్రబాబుకు చెందిన భూమిలో, రాతి రాళ్ళు పాతుతూ, ఫెన్సింగ్ ఏర్పాటు చేసారు. దీంతో అక్కడ గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. చంద్రబాబు ఏమైనా వేయిస్తున్నారా అని ఆరా తీయగా, స్థలం వేరే వారు కబ్జా చేసి ఫెన్సింగ్ వేయిస్తున్నారు అంటూ గ్రహించారు. ఇంకేముంది, ఇది ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. టీవీ చానల్స్, మీడియా మొత్తం, హోరెత్తాయి. రాష్ట్రంలో చంద్రబాబు స్థలం కూడా రక్షణ లేదు అంటూ హోరెత్తింది. అయితే ఇందులో వైసీపీ హ్యాండ్ కూడా ఉండటంతో, ఒక్కసారిగా స్టొరీ మలుపు తిరిగింది. ఈ స్థలం మాది అంటూ, వైసీపీ ప్రోద్బలంలో అక్కడే ఆ ఊరిలో ఉన్న ఒక కుటుంబం ముందుకు వచ్చి హడావిడి చేసింది. ఇదంతా వైసీపీ ప్లాన్ కాబట్టి, చంద్రబాబు తండ్రి కర్జూర నాయుడు, ఈ స్థలం కబ్జా చేసాడు అంటూ పుకార్లు పుట్టించారు. పేటీయం బ్యాచ్ తో విష ప్రచారం మొదలు పెట్టారు. అయితే తన స్థలం కబ్జా కావటం పై, చంద్రబాబు స్థానికంగా ఉన్న తన బంధువుల చేత, ఫిర్యాదు చేయించటంతో, వైసీపీ ప్లాన్ బెడిసి కొట్టింది.

cbn 200022022 2

చంద్రబాబు నాయుడుకి నారా వారి పల్లెలో ఉన్న భూమిని, నారా వారి పల్లెకు చెందిన, రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి కబ్జా చేసే ప్రయత్నం చేసాడు. అయితే చంద్రబాబు నాయుడు, జరిగిన పరిణామం పై రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయటంతో, వారు స్పందించారు. చంద్రబాబు తరుపున దాస్తావేజులు, అటు వైపు వాళ్ళు ఇచ్చిన కాగితాలను, తాహసీల్దార్ పరిశీలించారు. అయితే చంద్రబాబు నాయుడు తరుపు ఇచ్చిన ఈసీ, రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి రావటం, అందులో చంద్రబాబు తండ్రి కార్జున నాయుడు పేరు ఉండటంతో, ఇవే సరైన డాక్యుమెంట్లు అంటూ, తాహసీల్దార్ ప్రకటించారు. ఈ భూమి చంద్రబాబు నాయుడుకు చెందుతుంది అంటూ, తాహసీల్దార్ నిర్ధారణ చేసారు. అయితే రెండు రోజుల నుంచి వైసిపీ వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. అధికారులు అది చంద్రబాబుకు చెందిన స్థలమే అని నిర్ధారణ చేసారు. లేని సమస్యలు సృష్టించి, అందులో చంద్రబాబుని లాగి, చంద్రబాబు కుటుంబాన్ని అవమానించేలా చేసిన వైసీపీ పై, టిడిపి శ్రేణులు మండి పడుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read