ఈ నెల 15వ తేదీన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉషశ్రీ చరణ్, తన అనుచరులతో కలిసి ఊరేగింపుగా, సొంత నియోజకవర్గం కళ్యాణదుర్గంలో పర్యటించారు. భారీ ఊరేగింపుతో మంత్రి రావటం, పోలీసులు ఆంక్షలు పెట్టటంతో, ట్రాఫిక్ లో చిక్కుకుని ఒక దళిత బాలిక చనిపోయింది అంటూ, వార్తలు వచ్చాయి. చనిపోయిన చిన్నారి తండ్రి కూడా మీడియా ముందుకు వచ్చి, పోలీసుల వైఖరే కారణం అంటూ, ఆవేదన వ్యక్తం చేసారు. అదే రోజు పోలీసులు తీరుకి నిరసనగా, అక్కడున్న మిగతా ప్రజలతో కలిసి, రోడ్డు పైన బైఠాయించి, ఉషశ్రీ చరణ్ ఊరేగింపుని అడ్డుకున్నారు. ఈ వీడియోలు వైరల్ అవ్వటం, అలాగే వార్తల్లో కూడా ప్రముఖంగా ప్రచురితం కావటంతో, సోషల్ మీడియాలో అనేక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే మంత్రి ఆర్భాటానికి, ఒక చిన్నారి చనిపోవటంతో, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్, ఈ అంశం పై స్పందించారు. ట్విట్టర్ వేదికగా చిన్నారికి జరిగిన అన్యాయాన్ని, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు. దీంతో వైసీపీ మంత్రి ఆర్భాటం మరింత ప్రజల్లోకి వెళ్ళింది. అయితే దీని పై భారీగా డ్యామేజ్ జరుగుతుందని భావించిన అధికార పార్టీ నేతలు, పోలీసులతో ఒక మీడియా సమావేశం పెట్టించారు.

cbn 19042022 2

అందులో పోలీసులు ఒక సిసి టీవీ ఫూటేజ్ విడుదల చేసారు. మంత్రి ఊరేగింపులో, ఈ చిన్నారి తల్లిదండ్రులు చిక్కుకోలేదు అంటూ, వీడియో చూపించారు. అయితే సంఘటన రాత్రి జరిగితే, సాయంకాలం వీడియో చూపించటం చర్చకు దారి తీసింది. ఇక ఆ వీడియోలు ఉన్నది వారేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే పోలీసుల ప్రెస్ మీట్ అయిపోగానే, చంద్రబాబు, లోకేష్ పై కేసులు నమోదు చేసారు. వైసీపీ నేత కొంగర భాస్కర్ అనే వ్యక్తి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ప్రజలలో, పోలీసుల పై విద్వేషాలు రెచ్చ గొట్టారు అంటూ కేసు పెట్టటంతో, చంద్రబాబు పైన 153ఏ/34 సెక్షన్ల కింద కేసుని పోలీసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు. అయితే ఒక ప్రతిపక్ష నేతగా, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే, దానికి కూడా కేసులు పెట్టటం పైన, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక పక్క జరిగిన ఘటన, కుటుంబ సభ్యుల ఆవేదన కనిపిస్తుంటే, దానికి సమాధానం చెప్పకుండా, మా మంత్రి ఏమి చేయలేదు, మా పోలీసులు ఏమి చేయలేదు, మొత్తం చంద్రబాబు చేసారు, అంటూ ఎదురు కేసు పెట్టటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read