సరిగ్గా మూడు, నాలుగు నెలల ముందు, పవన్ కళ్య, జగన్ ను కలపాలని, అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, వీళ్ళిద్దరినీ కలిపితే, చంద్రబాబును రాజకీయాల నుంచి తప్పించవచ్చు అని, అప్పుడు ఏపిని ఆడుకోవచ్చు అని, వీళ్ళు వ్యూహాలు పన్నుతున్నట్టు, వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇవి వార్తలు మాత్రమే కావటం, సరైన ఆధారం లేకపోవటంతో, కొన్నాళ్ళుకు ఈ వార్తలు ఆగిపోయాయి. అయితే, ఇదంతా నిజమే అని ఇప్పుడు తేలిపోయింది. టీఆర్‌ఎస్, వైసీపీ రహస్య చర్చలు ప్రజలకు తెలిసిపోయాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌, చంద్రబాబుకు ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ ఆయనకు గిఫ్ట్‌గా మారుతుందన్నారు.

pk 22032019 2

పదేళ్లు భావోద్వేగాలతోనే గడిచిపోయాయని.. ఇక చాలు ఆపండని అన్నారు. ఏపీలో జగన్‌తో కలిసి పోటీచేయాలని కొంతమంది చెప్పారన్నారు. ముందు మీరు ఇద్దరూ కలిసి, చంద్రబాబుని తప్పించండి, టీడీపీని లేకుండా చేసి ఆ తర్వాత మీరిద్దరూ తేల్చుకోండని సూచించారని ఆయన చెప్పారు. అయితే జగన్‌పై తన అభిప్రాయాలు ఎలా మార్చుకుంటానని చెప్పానని పవన్‌ అన్నారు. వైసీపీకి అధికారాన్ని కట్టబెడితే భూకబ్జాలే కాదు... మీ ఇల్లు, ఆ కొండ, కొండ మీద పుట్ట, కొండపైనున్న చెట్టును కూడా దోచేస్తారని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల కిరాయి మూకలకు, రౌడీలకు భయపడమని చెప్పారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే... నేరుగా ఏపీలో కేసీఆర్ పోటీ చేయాలని, రాజమార్గంలో రావాలని అన్నారు.

pk 22032019 3

జనసేనలో చేరతామంటూ కొందరు నేతలు వచ్చారని... ఆ తర్వాత వారంతా వైసీపీలోకి వెళ్లారని పవన్ కల్యాణ్ తెలిపారు. వీరంతా వైసీపీలోకి ఎందుకు వెళ్లారా? అని ఆరాతీస్తే అసలు విషయం తెలిసిందని... వారికి హైదరాబాదులో ఆస్తులు ఉన్నాయని చెప్పారు. ఆస్తులకు సంబంధించి తమకు సమస్యలు ఉన్నాయని వారు చెప్పారని తెలిపారు. జరుగుతున్నవన్నీ గమనిస్తుంటే... అసలు రాజకీయం అర్థమవుతోందని చెప్పారు. నాయకులను బెదిరించి రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. కోడికత్తి దాడిపై నానా హంగామా చేసిన వైసీపీ అధినేత జగన్... సొంత బాబాయ్ వివేకా హత్యకు గురైతే మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. హత్యారాజకీయాలు చేసేవారు అధికారంలోకి వస్తే... రాష్ట్రం ఏమవుతుందో అనే భయం తనను వెంటాడుతోందని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read