ఎక్కడైనా సరే ప్రజలకు ఆపద వస్తే ప్రభుత్వం స్పందించాలి. అది ప్రభుత్వానికి,కష్టమైన నష్టమైనా, అసాధ్యమైనా, ఎలాగైనా కిందా మీదా పది, ప్రజలకు మంచి చేయాలి. ముఖ్యంగా కో-ర-నా లాంటి విపత్కర సమయంలో, ప్రభుత్వాలు మరింత బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వాలు ఎప్పుడూ తాము కరెక్ట్ చేస్తున్నాం అనే అనుకుంటాయి. అలా కాకుండా ప్రజల బాధలు వినాలి, ప్రతిపక్షాల విమర్శలు స్వీకరించాలి. అలా చేయకుండా, ప్రతిపక్షాల పై ఎదురు దాడి చేసి, మేము చేయలేం, మీరు చేసిపెట్టండి అంటే, దాన్ని చేతులు ఎత్తేయటమే అని కదా అనేది ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతుంది. ముఖ్యంగా క-రో-నా ని ఎదుర్కోవటానికి, అత్యవసరంగా కావాల్సింది వ్యాక్సిన్లు. ప్రజలకు ఎంత తొందరగా వ్యాక్సిన్లు వేస్తే అంత మంచిది. కేంద్రం ఇప్పటికే తన వంతు సాయం చేస్తుంది. అయితే 15 రోజులు క్రితం, రాష్ట్రాలకు కూడా అవకాసం ఇస్తూ, మీరు కూడా వ్యాక్సిన్ లు ఆర్డర్ తెప్పించుకోవచ్చని, రాష్ట్రాలకు కూడా చెప్పింది. అన్ని రాష్ట్రాలు ఆర్డర్ ఇచ్చి, వ్యాక్సిన్ లు తెప్పించుకుని, తమ ప్రజలకు వేస్తున్నాయి. అయితే అనుహ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, లేఖ రాసి ఊరుకుంది. ఇప్పటికీ అడ్వాన్స్ ఇవ్వలేదు. కేవలం లేఖ రాసి, అది చూపించి, మేము వ్యాక్సిన్ ల కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తుంది.
దీని పైనే ప్రతిపక్షం తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. అన్ని రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్ తెప్పించాయని, ఏపి ప్రభుత్వం మాత్రం ఇంకా ఎందుకు తెప్పించలేదు అంటూ ప్రశ్నించాయి. అయితే దీనికి మొదట్లో తప్పు కేంద్రం మీదకు నెట్టే ప్రయత్నం చేసిన వైసిపీ, అది వర్క్ అవుట్ కాక పోవటంతో, మేము 1600 కోట్లు ఇస్తాం, ఎవరి ఎకౌంటు లో వేయమంటే వారి ఎకౌంటు లో వేస్తాం, చంద్రబాబు వ్యాక్సిన్ లు ఇప్పించాలి అంటూ, ఎదురు దాడి మొదలు పెట్టింది. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఈ ప్రచారం పై చంద్రబాబు ఈ రోజు స్పందించారు. నేను వ్యాక్సిన్ లు ఇప్పిస్తే, ఇక మీరు ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పిస్తే వ్యక్సిన్స్ వేస్తామని చెప్పటం, బాధ్యతల నుంచి పారిపోవటమే అని అన్నారు. మీరు ఇంకా ముఖ్యమంత్రిగా ఉండటం ఎందుకు, అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేని మీరు, ఆ పదవిలో కొనసాగే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల పై నేత్తకుండా, బాధ్యతలు తీసుకుని ప్రజలను కాపాడాలని అన్నారు.