ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా, తాడిపత్రిలో పర్యటిస్తున్నారు. వైసీపీ నేతలు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపిన విషయం తెలిసిందే. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించటానికి చంద్రబాబు తాడిపత్రిలో పర్యటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికర విషయం చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది. తాడిపత్రికి చెందిన ఒక గ్రామ స్థాయి కార్యకర్త, చంద్రబాబుకి రాసిన లేఖ, వివిధ పత్రికా కార్యలయాలుకు పంపించి, ఇది ప్రచురణ అయ్యేలా చూడమన్నారు. ఇది తెలిసిన టిడిపి కార్యాలయ సిబ్బంది, ఆ లేఖను తీసుకుని, చంద్రబాబుకి కూడా ఇచ్చారు. ఆ లేఖలో ఒక సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పడే ఆవేదన అంతా పంచుకున్నాడు, ఆ కార్యకర్త. "అన్నా, చంద్రన్నా" అంటూ లేఖ మొదలు పెట్టారు. మీరు ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్తారు, కాని అధికారంలోకి వస్తే మాత్రం, మీ నుంచి, మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు దాకా ఎవరూ మమ్మల్ని పట్టించుకోరు అన్నారు.

పచ్చిగా చెప్పాలి అంటే, మీకు అధికారంలో ఉంటే కార్యకర్త కనిపించదు, మీరు రాష్ట్ర అభివృద్ధిలో మునిగిపోతే, స్థానిక నాయకుల వద్దకు వెళ్ళాలన్నా, రికమండేషన్లు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పారు. అంతే కాదు, నాయకులు అందరూ కలిసి, వాస్తవ పరిస్థితి చెప్పకుండా, ఎలా భజన చేసే వారో కూడా ఆ లేఖలో రాసారు. అధికారంలో ఉండగా మేము కనిపించం, కాని ప్రతిపక్షంలో ఉంటే, మీకు దేవుళ్ళు లాగా కనిపిస్తాం అని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా, మమ్మల్ని చంపేస్తున్నారు. ఇలాంటి మమ్మల్ని కాదని, ఎవరెవిరినో అందలం ఎక్కించారు, ఇప్పుడు వాళ్ళు ఏమి చేసారు, అని ప్రశ్నించారు. మీరు వారి మాటలు విని మునిగిపోయారు అని అన్నారు. ఇప్పటికైనా దయచేసి కార్యకర్తలను వదలకండి, సిన్సియర్‌ కార్యకర్తలను, నమ్మండి అంటూ ఆ లేఖను ముగించారు. ఈ లేఖ చూసిన వారు , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత మనోవేదనకు గురయ్యారో అర్ధమవుతుంది అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read