తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పాలకుడి చేసే చట్టాలు, ఆలోచనలు ఎంత ముందుచూపుతో ఉంటాయో అనే దానికి కాపు రిజర్వేషన్లు అంశం మరో చక్కని ఉదాహరణ. చంద్రబాబు ఆధ్వర్యంలో రూపొందించే చట్టాలు ఎంత పకడ్బందీగా వుంటాయో ఇదివరకూ సీఆర్డీఏ చట్టం నిరూపించింది. టిడిపి అధికారంలో వున్న 2014-19 కాలంలో ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పెట్టి ఆమోదించారు. ఈబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ దెబ్బ తినకుండా, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపులకు చంద్రబాబు సర్కారు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ ఎత్తేసింది. ఓబీసీ రిజర్వేషన్లు గురించి ప్రశ్నించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు కాపులకు టిడిపి సర్కారు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చిన బిల్లు చెల్లుతుందా అని రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి సామాజిక న్యాయశాఖ మంత్రి ప్రతిమా భౌమిక్ సమాధానం ఇచ్చారు. కాపులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ చెల్లుతుందని స్పష్టం చేశారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమేనని కేంద్రం తేల్చేసింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్ర సర్కార్ వెల్లడించింది.
చంద్రబాబు నిర్ణయం కరెక్ట్... లోకసభలో స్పష్టం చేసిన కేంద్రం....
Advertisements