ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై ఆచితూచి అడుగేయాలని, ఊహాగానాలకు త్వరలో తెరదించి ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేయకుండా ఖాళీ అయిన రెండు బెర్త్‌లు నింపాలనే యోచనతో ఉన్నారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి పదవికి కామినేని శ్రీనివాస్, దేవదాయశాఖకు పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేసిన సంగతి విదితమే. దేవదాయ శాఖకు సంబంధించిన అంశాలను తాత్కాలికంగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ రెండు స్థానాలను ఇప్పటికే భర్తీ చేయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. కేబినెట్‌లో మైనారిటీలకు చోటు కల్పించాలని, వారు తెలుగుదేశం వైపు చూస్తున్నారనే నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీని ఎప్పటి నుంచో అంటిపెట్టుకు ఉన్న ఎమ్మెల్సీ ఎంఎఫ్ షరీఫ్ పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది.

cbn 08072018 2

మంత్రివర్గం మొత్తంగా విస్తరణ లేదా మార్పులు, చేస్తే ఎలా ఉంటుంది ? పనితీరు బాగాలేని మంత్రులను మందలించి వదిలితే ఎలా ఉంటుంది అనే దాని పై కూడా కసరత్తు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారా అని ఇప్పుడున్న మంత్రులకు భయం పట్టుకుంది. అలాగే, కొత్తగా ఇద్దర్ని మంత్రివర్గంలో చేర్చుకోవటంతో పాటు మిగిలిన నామినేటెడ్ పదవులను కూడా భర్తీచేసి ఇక జిల్లాల వారీ పర్యటన చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. షరీఫ్‌తో పాటు మరో పదవి మహిళలకు కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయమై ఇటీవల చర్చకు వచ్చినట్లు చెప్తున్నారు. ఈనెల 12వ తేదీన పార్టీ పోలిట్‌బ్యూరో, సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో వచ్చే ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ ప్రకటించాలని కూడా అధినేత మదిలో భావనగా చెప్తున్నారు.

cbn 08072018 3

రాష్ట్రంలో తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కాపులకు మరో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడిగా ఓ వైపు మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ టీడీపీపై కత్తులు నూరుతున్న తరుణంలో ఆ వర్గానికి చెందిన దీటైన నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఎలా ఉంటుందనే అంశాలు ప్రస్తావనకు వస్తున్నట్లు తెలిసింది. కాగా కమ్మ సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరికొందరు నేతలు ఇప్పటికే నిరీక్షిస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికి మంత్రి పదవి కట్టబెట్టినా అలకలు తప్పవని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో మైనారిటీలకు మంత్రిపదవితోనే సరిపెడితే ఎలా ఉంటుందనే విషయాలను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు వినికిడి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read