ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్లు బిల్లులు రాక‌పోవ‌డంతో దొంగ‌ల‌య్యారు. పెన్ష‌న‌ర్ల‌కు పెన్ష‌న్ డ‌బ్బులు చెల్లించ‌కుండా పికెట్ పాకెట‌ర్ల‌ని చేస్తారా అంటూ అధికారుల‌ను హైకోర్టు ప్ర‌శ్నించింది. దీంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగుతోంది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా ఏపీఈడబ్ల్యూఐడీసీని ఆదేశించాలని కోరుతూ కాంట్రాక్టర్‌ పీఎన్‌వీ రమణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి బ‌ట్టు దేవానంద్ అధికారుల తీరుని త‌ప్పుబ‌ట్టారు. న్యాయస్థానం ముందు హాజరు అవ్వాల‌ని ఆదేశాలు ఇస్తే త‌ప్పా బిల్లుల‌ను చెల్లించే ప‌రిస్థితి లేక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగుంద‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్న ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు స‌కాలంలో జీతాలు ఇవ్వ‌డంలేద‌ని, కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించ‌డంలేద‌ని వ్యాఖ్యానించారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు నెల‌నెలా పింఛ‌న్లు ఇవ్వ‌క‌పోతే, వారి అవ‌స‌రాల‌కు సొమ్ము ఎవ‌రిస్తార‌ని అధికారుల‌ను నిల‌దీశారు.  పెన్షన్‌ చెల్లించకుండా వారిని పికెట్ పాకెట‌ర్ల‌గా మారుస్తారా అని ప్ర‌శ్నించారు. అయితే దీని పై చంద్రబాబు స్పందించారు. కోర్టు కామెంట్ లు విన్న తరువాత, ఇంకోడు అయితే, ఉరి వేసుకుని చస్తారు అంటూ, ఘాటు వ్యాఖ్యలు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read