నిన్న వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రతిపాదనల ఆమోద బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తపరిచారు... నవ్యాంధ్ర నిర్మాణానికి ఇంత కష్టపడుతుంటే, కొంత మంది ఐఏఎస్‌ లు తీరు విచాత్రంగా ఉంది అని అన్నారు... హైదరాబాద్‌ నుంచి వచ్చిపోతున్న కొంత మంది ఐఏఎస్‌ అధికారులకు ఈ రాష్ట్రంపై మమకారం కనిపించడం లేదని, మొక్కుబడిగా ఉద్యోగం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండి పనిచేస్తేనే ఈ ప్రాంతంపై మమకారం వస్తుందని, మొక్కుబడిగా వచ్చే వారిలో ఆ తపన ఎక్కడ ఉంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు..

cbn 24122017 1

ఇక్కడ ఉన్న నగరాలకన్నా పెద్ద నగరాలు దేశంలో చాలా ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలు అక్కడే హాయిగా కార్యాలయాలు పెట్టుకోవచ్చు. మనం ఏవైనా ప్రోత్సాహకాలు ఇస్తేనో లేదా బాగా సహకరిస్తామనో అనుకొంటేనే ఇక్కడ దాకా వస్తారు. కంపెనీలు వస్తేనే ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. హోటళ్లు పెరుగుతాయి. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి కనిపిస్తుంది. మేం ఊరూరా తిరిగి పెద్ద కంపెనీలను రమ్మని ఆహ్వానిస్తున్నాం. తీరా వచ్చిన తర్వాత మనవాళ్లు రకరకాల కొర్రీలు వేసి వాళ్లను విసిగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చి పోతున్న వారిలో కొందరికి ఈ రాష్ట్రం అభివృద్ధి పట్టడం లేదు. ఇక్కడకు పెట్టుబడులు, కంపెనీలు రావాలన్న తపన వారిలో కనిపించడం లేదు, అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు...

cbn 24122017 1

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ విశాఖలో తన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఎంతో కృషి చేసామని, వారు విశాఖలో అంతర్జాతీయ స్థాయి డెవల్‌పమెంట్‌ సెంటర్‌ పెట్టడానికి ముందుకు వచ్చారని అన్నారు. ఆ కంపెనీ 40 ఎకరాల స్థలం అడిగింది. మనం ఒప్పుకున్నాం. కొందరు అధికారులు ఆ ప్రతిపాదన పై రెండు మూడు కొర్రీలు వేశారు. వాటికి సమాధానాలు ఇచ్చిన తర్వాత ఆ కంపెనీకి కేవలం పది ఎకరాల స్థలం చాలని ప్రతిపాదన పంపారు. ఏం పద్ధతి ఇది?’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌ కలిసి విశాఖలో ఎనిమిదేళ్లలో రూ.455 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. అధికారుల తీరుపై సీఎం ఆగ్రహంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్‌ జోక్యం చేసుకొని కొంత చల్లార్చారు. కొందరు అధికారులతో ఇబ్బంది ఉన్నా చాలామంది బాగా చేస్తున్నారని, కష్టపడేవారిని కూడా చూడాలని ఆయన అనడంతో సమావేశంలో వాతావరణం చల్లబడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read