టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి ప్రజలకి దూరం చేయాలని వైసీపీ వేయని ఎత్తుగడ లేదు. పర్యటనలు అడ్డుకోవాలని చేయని ప్రయత్నంలేదు. కందుకూరు సభలో విషాదాన్ని సాకుగా చూపాలనుకున్నారు. అయితే జనం మరింత ఉత్సాహంతో కావలి, కోవూరు సభలకు పోటెత్తారు. గుంటూరు బహిరంగ సభలో చంద్రబాబు వెళ్లిపోయాక జరిగిన ఘటనతో ఆయనని కట్టడి చేయాలని చూశారు. సభల నిర్వాహకులను అక్రమకేసుల్లో అరెస్ట్ చేయించారు. సిపాయిల తిరుగుబాటు నాటి బ్రిటిష్ చట్టం తీసుకొచ్చి జీవో నెంబర్ 1 పేరుతో మరో కుట్రకి తెరతీశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు హక్కులు హరించేలా అప్రజాస్వామిక పద్ధతులతో వైసీపీ సర్కారు, పోలీసులు కుతంత్రాలు పన్నారు. అర్ధరాత్రి జీవో తెచ్చి తరువాతి రోజు చంద్రబాబు కుప్పం పర్యటనలో అమలుకి విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ప్రతిపక్షనేతని రాష్ట్రంలో అడ్డుకోవాలనుకున్నారు సాధ్యంకాలేదు. సొంత కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చూడాలనుకున్నారు. అది వైసీపీ దుస్సాహసమే అయ్యింది. అడుగడుగునా జననీరాజనంతో చంద్రబాబు మూడురోజుల పర్యటన అన్‌స్టాపబుల్ గా విజయవంతమైంది. ప్రచారరథాన్ని సీజ్ చేశారు. తాను ప్రయాణిస్తున్న వాహనాన్నే ప్రచార రథం చేసుకున్నారు. టూరు జరగడానికి వీల్లేదని వైసీపీ పోలీసులు అడ్డుపడ్డారు. అయితే నడిచి వెళ్లడానికి మీకేం అభ్యంతరమంటూ పాదయాత్ర ప్రారంభించారు. ఎక్కడ అడ్డగిస్తే అక్కడే బైఠాయించి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపారు. మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ పోలీసులు ఎత్తుకెళ్లారు. తన మాటనే మైకుగా, తన గళాన్నే నినాదంగా బాబు ప్రకటించారు. సీబీఎన్ ఎటూ కదలకుండా ఖాకీలు వలయంగా మారారు. నారా సింహంలా బస్సు ఎక్కి తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. రాష్ట్ర ప్రజలని, నా అభిమానులను, తెలుగుదేశం కేడర్ని, నా నియోజకవర్గ జనాన్ని కలవకుండా జగన్ లాంటి వందమంది నియంతలు వచ్చినా ఆపలేరని తన టూరుతో స్పష్టం చేశారు చంద్రబాబు. టిడిపి అధినేత ఎనర్జీకి ఎదురులేదు. పట్టుదలలో విక్రమార్కుడు. అలసట అనేద ఎరుగని అతిరథమహారధుడు చంద్రబాబు అన్ స్టాపబుల్.
పోలీసులు వచ్చినా, పేటీయం బ్యాచులు వచ్చినా.. జీవో 1 తెచ్చినా.. చంద్రబాబు అన్ స్టాపబుల్..
Advertisements