నెల్లూరు జిల్లాలో టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ప‌ర్య‌ట‌న ముగిసింది. వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో ఎంతో ఘ‌నంగా ప‌ర్య‌ట‌న కందుకూరుతో ఆరంభం అయ్యింది. ఆ స‌భలో నెల‌కొన్న విషాదం టిడిపికి ఒక్క‌సారిగా కుదుపులా తాకింది. ట్ర‌బుల్ షూట‌ర్‌, అప‌ర‌చాణ‌క్యుడుగా పేరుగాంచిన చంద్ర‌బాబు, తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యుల మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌పోయారు. స‌భ ప్రారంభంలో అంద‌రినీ అలెర్ట్ చేసినా ఆప‌ద వ‌చ్చింది. ఇప్పుడు ఏం ఆలోచించినా లాభంలేద‌ని, ఎనిమిది మంది ప్రాణాలు పోయాయ‌ని, ఆ కుటుంబాల‌ను ఆదుకోవ‌డం ఒక్క‌టే త‌న ముందున్న ల‌క్ష్యంగా చంద్ర‌బాబు ముందుకు క‌దిలారు. సంఘ‌ట‌న స‌మాచారం తెలిసిన వెంటనే మీటింగ్ ఆపేశారు. హుటాహుటిన‌ హాస్పిటల్ లు వెళ్లారు. బాధితుల‌కు అందుతున్న వైద్యం, కావాల్సిన స‌హాయం స‌మ‌కూర్చారు. పార్టీ నుంచి, టిడిపి నేత‌ల నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి దాదాపు 30 ల‌క్ష‌ల వ‌ర‌కూ సాయం ప్ర‌క‌టించారు. మృతుల అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు మ‌నుషుల్ని తీసుకురాలేను కానీ, వారు చేయాల్సిన బాధ్య‌త‌ల‌న్నీ ఇంటి పెద్ద‌గా నెర‌వేరుస్తాన‌ని హామీ ఇచ్చారు. ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌లోనే బాధితుల అంద‌రి ఇళ్ల‌కీ వెళ్లి ఓదార్చి వ‌చ్చారు. వైసీపీ చిల్ల‌ర ఆరోప‌ణ‌లు ప‌ట్టించుకోకుండా బాధితుల‌ని ఆదుకోవ‌డంపైనే దృష్టి పెట్టారు. త‌న‌కు తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు కుటుంబ‌స‌భ్యులే అనే సందేశం పంపారు. జిల్లాలో ఒక్క టిడిపి ప్ర‌జాప్ర‌తినిధీ లేరు. ఓ వైపు ప్ర‌భుత్వం, మ‌రోవైపు స‌ర్కారు పోలీసులు కుతంత్రాలు ప‌న్నుతున్నా..స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌తో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read