ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారికి రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప కానుకను అందించబోతున్నది. జనవరి ఒకటో తేదీ నుంచి "చంద్రన్నపెళ్లికానుక" పేరుతో సరి కొత్త పథకాన్నిరాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుక రంగం సిద్దంచేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉదయలక్ష్మీ సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పధకం ప్రకటన చెయ్యగానే, అందరూ ఎదో ప్రజలను ఓట్లు కోసం ఆకట్టుకునే కొత్త పధకం అని లైట్ తీసుకున్నారు కాని, దీని వెనుక చాలా కసరత్తు జరిగింది...
బీసీ కుటుంబాల్లోని పేద యువతులకు చిన్న వయసులోనే జరుగుతున్న పెళ్లిళ్ళు జరుగుతున్నాయని, తద్వారా మహిళలు త్వరగా అనారోగ్యపాలు అవుతున్నారని, మహిళలకు గృహ హింస ఎక్కువ అవుతుంది అని ప్రభుత్వం గ్రహించింది... ఇలా ఒక పధకం పెట్టి, ప్రతి బీసీ వధూవరులు తమ వివాహాలను రిజిస్టర్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు, చిన్న వయస్సులోనే పెళ్లిళ్లను నిరోధించడంతో పాటు, పెళ్లి తర్వాత కూడా వేధింపుల నుంచి ఆమెకు రక్షణ కల్పించవచ్చని, వివాహ సమయంలో ఆ కుటుంబాలకు ప్రభుత్వ ప్రోత్సాహం ద్వారా సంతృప్తి కలిగించేందుకు ఈ పథకం రూపొందిచారు. దీంతో పెళ్లిళ్లు ఇక నుంచి అధికారికంగాక నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు.
బీసీ కుటుంబాల్లోని పేద యువతుల పెళ్లి సందర్భంలో ఈ పథకం కింద యువతి కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కేవలం పెళ్లి సమయంలోనే ప్రభుత్వం ఈ పథకం కింద ఈ సాయాన్ని అందించి, వివాహిత తల్లిదండ్రులకు ప్రభుత్వం బాసటగా నిలవాలని ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. ఈ పథకం కింద లబ్ది పొందాలి అంటే తప్పనిసరిగా బీసీ అయి ఉండాలి. పెళ్లి కాని ఏపీకి చెందిన యువతి అయి ఉండాలి. 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి 21 ఏళ్ల వయసు నిండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. పదో తరగతి పాస్ కావాలి. ఇందుకు సంబంధించి మీ-సేవ ద్వారా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పట్టిన తేదీ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయం, ఆధార కార్డు, పెళ్లికార్డు, పోటోలు, తెల్ల రేషన్ కార్డు కాపీలను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.