ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం... పొద్దున్న అమరావతిలో ఉన్నారు, అనేక రివ్యూలు జరిపారు... మధ్యనానికి వైజాగ్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు... సాయంత్రం అందప్రదేశ్ ప్రజల జీవనాడి కోసం నాగపూర్ వెళ్లారు... రాత్రికి విదేశీ పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు... మరుసటి రోజు సాయంత్రానికి అమెరికా చేరుకున్నారు... ఇలాంటి షడ్యుల్ ఒక 68 ఏళ్ళ మనిషి, మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు అంటే నమ్మగలరా... మన ఇంట్లో ఆ వయసు వారు, ఎంత రిలాక్స్డ్ గా రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నాంగా... మన ఇంట్లో పెద్ద వాళ్ళు దాకా ఎందుకు, మనం అంత ఫిట్నెస్ గా ఉండగలమా ?
ముఖ్యమంత్రి చంద్రబాబు అంతలా ఈ వయసులో కష్టపడ్తున్నారు అంటే, అది ఆయన క్రమశిక్షణతో వచ్చిన ఫిట్నెస్... పొద్దున్నే యోగా, వ్యాయామం కాని, ఆయన తినే డైట్ కాని, అంతా బ్యాలన్సుడ్ గా ఉంటుంది... ఎక్కడా టెంప్ట్ అవ్వరు... ఆయన పట్టుమని తినేది ఒక ముద్ద, కానీ కండిషనల్ గా ఉంటుంది. ఏదైనా ఎక్కువేమీ తినరు ఒకటీ అరా అంతే.. ఆయన భోజనం, మామూలుగా మనం తినే స్నాక్స్ తో సమానం అన్నట్టుఉంటుంది. చంద్రబాబు కొద్ది రోజుల క్రిందట, తాను ఎంత బ్యాలన్సుడ్ డైట్ తీసుకునేది మీడియాతో పంచుకున్నారు... ఉదయం టిఫిన్ జొన్న ఇడ్లీ లేక ఉప్మా లేక రెండు దోసెలు తీసుకుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు,మధ్యాహ్నంలంచ్ కు మధ్యలో పలురకాల ఫ్రూట్ లు తీసుకుంటారు. మధ్యాహ్నం లంచ్‌కి ... రాగులు, జొన్నలు, సజ్జలు, కూరగాయలు కొద్దిగా పెరుగన్నం తీసుకుంటున్నట్లు చెప్పారు.
అయితే విదేశీ టూర్లలో కూడా చంద్రబాబు మెనూ మారదు... చైనా, రష్యా, లండన్, అమెరికా ఎక్కడకి వెళ్ళినా అదే క్రమశిక్షణ.. తాజగా అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు, చికాగోలో పర్యటిస్తున్నారు... ఆయన లంచ్ చేస్తూ, చర్చలు జరుపుతున్న ఫోటోలు బయటకి వచ్చాయి... కొన్ని ఫ్రూట్స్, ఉప్మా, రాగి ముద్ద... అంతే ఇదే ఆయన మెనూ... ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి, అందునా మొదటి రోజు పర్యటన, వాతవరణం అలవాటు పడాలి.. సో, ఆయన ఎక్కడా టెంప్ట్ అవ్వకుండా, ఫిట్ గా ఉండి, పెట్టుబడిదారుల దగ్గర, కాన్ఫిడెంట్ గా ప్రెసెంట్ చేస్తున్నారు... చంద్రబాబు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అందరికీ తెలిసినా, మొదటిసారి ఆయన్ను దగ్గర నుంచి చూసినవారు, ఆయన కమిట్మెంట్, క్రమశిక్షణ చూసి, అభినందిస్తున్నారు..