మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో ఎంత మంది ఓట్లు లేపెసారో చూసాం. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ లో, రాజకీయ పార్టీలకు, ఈ ఓట్లు లేపెయ్యటం కూడా ఒక భాగం అయ్యింది. ఎప్పటికప్పుడు మన ఓటు ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే పోలింగ్ జరిగే రోజు, అక్కడకు వెళ్లి మీ ఓటు లేదని అవాక్కవ్వల్సిందే. ఓటరు జాబితాలో మీ పేరున్నదీ లేనిదీ ఇప్పుడే పరిశీలించుకోవచ్చు. ఇందుకు నాలుగు మార్గాలున్నాయి. ఆ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. చివరి నిమిషంలో నిరాశ చెందకుండా.. మీ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ముందుగా పేరు ఉందో లేదో చూసుకోండి, పేరు లేకపోతే ఫారం-6లో దరఖాస్తు చేసుకుని ఇప్పటికైనా ఓటరుగా చేరొచ్చని స్పష్టం చేస్తోంది.

vote 2122018 2

ఫారం-6లో కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని వాటిని బూత్‌ స్థాయి అధికారులకు అందివ్వాలి. అలాగే సీఈవోఆంధ్ర, ఎన్‌వీఎస్‌పీ వెబ్‌సైట్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ విడుదలై, నామినేషన్ల స్వీకరణ గడువు చివరి రోజు వరకూ కొత్తగా ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది. వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం ఎన్నికల సంఘం వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. విజయవాడలోని భారతీనగర్‌లో రాష్ట్ర స్థాయి కాల్‌సెంటర్‌ను ప్రధాన ఎన్నికల అధికారి ఆర్‌.పి.సిసోడియా గురువారం ప్రారంభించారు. దీనికి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎప్పుడైనా ఫోన్‌ చేసి జాబితాలో మీ పేరు ఉందా? లేదా? అనేది అడిగి తెలుసుకోవొచ్చు. రాష్ట్ర, జిల్లా స్థాయి కాల్‌ సెంటర్ల నంబర్లను ప్రధాన ఎన్నికల అధికారి ఆర్‌.పి.సిసోడియా వెల్లడించారు.

vote 2122018 3

ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనేది తెలుసుకోవడం ప్రతి ఓటరు ప్రాథమిక బాధ్యత. సంక్షిప్త సందేశాలు పంపించడం ద్వారా, వెబ్‌సైట్‌ల్లో చూసుకోవడం, రాష్ట్ర, జిల్లా స్థాయి కాల్‌సెంటర్‌లకు ఫోన్‌ చేయడం ద్వారా జాబితాలో పేరుందా? లేదా అనేది తెలుసుకోవొచ్చు. పోలింగ్‌ కేంద్రాల్లో నుంచి కూడా జాబితాలు చూసుకుని తనిఖీ చేసుకోవచ్చు. పేరు లేకపోతే తక్షణమే ఫారం-6లో దరఖాస్తు చేసుకోండి. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకూ ఈ అవకాశం ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇంకా సందేహాలు ఉంటే ఈ 94911 11091 నెంబరుకు ఫోన్‌ కాల్స్‌ ద్వారా కూడా సంక్షిప్త సందేశం లేదా వాట్సాప్‌ సందేశం పంపించి నివృత్తి చేసుకోవచ్చు. వాటికి నేనే నేరుగా స్పందిస్తా. త్వరలోనే ప్రత్యేక యాప్‌ను కూడా ప్రారంభం కానుంది. మెసేజ్ ద్వారా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవాలి అంటే, AP Space VOTE Space VOTER ID NUMBER ని 9223166166 లేదా 51959 నెంబర్ కు sms చెయ్యండి. రెండో విధానం, www.ceoandhra.nic.in, www.nvsp.in వెబ్సైటు లో చెక్ చేసుకోవటం, మూడో విధానం, కాల్ సెంటర్ కు ఫోన్ చెయ్యటం 94911 11091 , నాలుగో విధానం, నేరగా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి చూడటం. ప్రతి శనివారం, మీ పోలింగ్ కేంద్రంలో ఈ జాబితా ఉంటుంది. ఇలా నాలుగు విధాలుగా, మీ ఓటు ఉందో లేదో తెలుసుకుని, అప్రమత్తంగా ఉండవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read