ధర్మవరం పట్టణానికి చెందిన జుజూరి నాగరాజు గ్రాఫ్‌ డిజైనర్‌గా పనిచేస్తూ తన అద్భుత డిజైన్‌ ద్వారా అనునిత్యం నూతన వైవిధ్యాన్ని సృష్టిస్తూ, పట్టుచీరల ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారు. దీంతో చేనేత, జౌళి శాఖ అధికారులు నాగరాజుకు మరింత చేయూతనివ్వడంతో ప్రభుత్వం తరపున చేనేత, జౌళి శాఖకు సంబంధించిన స్టాల్స్‌ను ఎక్కడ ఏర్పాటు చేసినా అక్కడ నాగరాజు తాను రూపొం దించిన పట్టుచీరలు, పట్టు వస్త్రాలతో తన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో చేనేత జౌళి శాఖ అధికారులు ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న 12 పథకాలను, తయారు చెయ్యమని చెప్పారు.

cheneta 08082018 2

దీంతో 12 పథకాలైన రుణమాఫీ, వృద్ధా ప్య పింఛన్లు, 50శాతం విద్యుత్‌ రాయితీ, నూలు, రంగులపై 20శాతం సబ్సిడీ, చేనేత కార్మి కుల పొదుపు పథకం, చేనేత క్లస్టర్లు, చంద్రన్న బీమా, ఆదరణ పథకం వంటి పథకా లను పట్టువస్త్రంలో రూపొందించి సీఎం చంద్రబాబునాయుడుకు అందజేయాలని నాగరాజు కు సూచించారు. దీంతో నాగరాజు గత 5రోజులుగా 5మంది కార్మికులతో రేయింబ వళ్ళు కష్టపడి రూ.20వేలు వ్యయంతో పట్టువస్త్రాన్ని రూపొందించి అందులో ప్రభుత్వం చేనేత కార్మికులకు అందజేస్తున్న 12 పథకాలను రూపొందించి బార్డర్‌లో మన రాష్ట్ర చిహ్నాలైన రామచిలుక, వేపచెట్టు, కృష్ణ జింకలను రూపొందించి ముఖ్యమంత్రి చిత్రపటాన్ని కూడా అందులో పొందుపరిచి జాతీయ చేనేత దినోత్సవ సందర్బంగా మంగళవారం సీఎంకు స్వయంగా అందజేసి ధర్మవరం చేనేత ఖ్యాతిని మరింత ఇనుమడింపచేశారు.

cheneta 08082018 3

సంక్షో భంలో కూరుకుపోయిన చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జాతీయ చేనేత దినోత్స వం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండల పరిధిలోని సెయింట్‌ ఆన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. చేనేత రంగం కనుమరుగు కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంద న్నారు. వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగంపై ఆధారపడి ఎక్కువ మంది జీవిస్తున్నారని, వారి సంక్షేమా నికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు.

cheneta 08082018 4

తాను హామీ ఇచ్చిన మేరకు చేనేతలకు రూ.111 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో చేనేతలకు రూ.12కోట్లు రుణ మాఫీ జరిగిందని, వీటిలో చీరాలకు రూ.11.50 కోట్లు వచ్చిందన్నారు. చేనేతలకు 50 సంవత్సరాలకే పింఛన్‌ మంజూరు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 96,900 మంది లబ్ధిపొందుతున్నారని, మర మగ్గాలను 50 శాతం రాయితీపై ఇచ్చినట్లు తెలిపారు. మరో 50 లక్షల మందికి ముద్ర రుణాలు ఇచ్చామన్నారు. చేనేత బజార్లు ఏర్పాటు చేశామని, అంతేగాక చేనేత అభివృద్ధికి పలు సంస్థలతో రూ.10వేల కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు.

cheneta 08082018 5

మంగళగిరిలో హ్యాండ్‌ లూమ్‌ పార్కు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ చేనేతలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చేనేతలు టీడీపీని ఆదరించారని పేర్కొన్నారు. గ్రామ దర్శిని కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లుతెలిపారు. స్పెషల్‌ రిబేట్‌ క్రింద రూ.30 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆప్కోకు రూ.150 కోట్లు రుణం మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చేనేతలకు హోస్‌ కం వర్క్‌షెడ్‌ నిర్మాణం చేస్తామని తెలిపారు. చేనేత వృత్తిలో ప్రావీణ్యం కలిగిన ఐదుగురిని సీఎం సత్కరించారు. సభలో మంత్రు లు అచ్చెన్నాయుడు, శిద్దా, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read