ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించారు. చంద్రబాబు ఏంటి, తమిళనాడు ప్రజలకు సహయం చెయ్యటం ఏంటి అనుకుంటున్నారా ? చెన్నైలో తాగు నీటి అవసరాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి, చెన్నై తాగు నీటి అవసరాలకు నీరుని విడుదల చేసారు... కృష్ణా జలాల్లో చెన్నై కోటా కింద 15 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని జలనవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆదేశించారు.
ఇప్పటికే చెన్నై తాగునీటికి 12 రోజులుగా శ్రీశైలం వెనుక జలాలను వదులుతున్నారు. కర్నూలు జిల్లా వెలుగోడు జలాశయం నుంచి గాలేరు-కుందు- సోమశిల ద్వారా చెన్నైకు నీరు పంపుతున్నారు. దీంతో చెన్నై వాసులకు తాగు నీటి కష్టాలు తీరనున్నాయి... పోయిన సంవత్సరం కూడా చంద్రబాబు, ఒప్పందం ప్రకారం చెన్నై కు నీళ్ళు ఇచ్చారు... పోయిన సంవత్సరం కూడా, ఆ రాష్ట్ర ముఖ్యంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం అభ్యర్ధన మేరకు, చంద్రబాబు నీళ్ళు విడుదల చేసారు.. మరో పక్క, నాగార్జున సాగర్‌కు జలకళ సంతరించుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర వరద ప్రవాహన్ని బట్టి ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తివేసి నీటిని వదలడంతో సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 582 అడుగులకు చేరింది. మరికొన్ని గంటల్లో ఇది 585 అడుగులకు చేరే అవకాశం ఉంది. దిగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అది క్రమంగా పెరుగుతోంది. పైన ఉన్న అల్మట్టి ప్రాజెక్టుకు లక్షా 6వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే.. దిగువకు లక్షా 35వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు లక్షా 35వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా దిగువకు లక్షా 38వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జురాలకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, దిగువకు 80వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగింది.