చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో రీపోలింగ్ కు ఈసీ ప్రకటన చేయడం తెలిసిందే. ఈ ఐదు ప్రాంతాలు టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడంతో అక్కడ వైసీపీ నేతల ప్రవేశానికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రీపోలింగ్ జరిగే వెంకటరామాపురం గ్రామానికి వెళ్లి ప్రచారం చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన చెవిరెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఊళ్లోకి అడుగుపెట్టేందుకు వీల్లేదని గ్రామస్థులు తెగేసి చెప్పడంతో చెవిరెడ్డి ఎంతో అవమానంగా ఫీలవడమే కాదు, తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు.

chevireddy 17052019

తిరుపతికి వస్తారుగా, అక్కడ చూసుకుంటా మీ సంగతి అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఓ దశలో మహిళలు సైతం చెవిరెడ్డి ప్రచారానికి అడ్డుతగిలారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించడంతో చెవిరెడ్డిపై భౌతికదాడులు జరగలేదు. గతరాత్రి, ఈ ఉదయం ఎన్ఆర్ కమ్మపల్లెలోనూ చెవిరెడ్డికి ఇదే తరహా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ప్రశాంతంగా పోలింగ్ జరిగిన తమ గ్రామాల్లో రీపోలింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారంటూ సదరు గ్రామాల ప్రజలు నిలదీస్తున్నారు. చెవిరెడ్డి ఫిర్యాదు మేరకే ఈసీ రీపోలింగ్ కు ప్రకటన చేసిందన్న వార్తల నేపథ్యంలో వారు ఆయనపై కారాలుమిరియాలు నూరుతున్నారు.

chevireddy 17052019

ఇక, రామచంద్ర పురం మండలం ఎన్ ఆర్ కమ్మపల్లిలో ఉద్రిక్తత పరిస్తితి తలెత్తింది. గ్రామంలోకి వెళ్ళిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రానీయబోమంటూ.. చీపుర్లు, చాటలు పట్టుకుని చెవిరెడ్డి కుమారునిపై గ్రామ మహిళలు దాడికి ప్రయత్నించారు. దీంతో కమ్మపల్లి గ్రామంలోకి వెళ్లకుండా అక్కడే బైఠాయించారు భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి. వైసీపీ నాయకులతో కలసి రోడ్డుపైనే బైఠాయించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వెంటనే కమ్మపల్లికి చేరుకున్నారు. అసలే, రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎస్పీ అన్బురాజన్ అక్కడకు చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read