సుప్రీం కోర్టులో ఈ రోజు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు, దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం కావటం, దేశ వ్యాప్తంగా, మన రాష్ట్రంతో సహా జరుగుతున్న విషయం కావటంతో, ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్నటు వంటి అధికారులు, అదే విధంగా పోలీసు వ్యవస్థ పని తీరు పై, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, నిప్పులు చెరిగారు. అధికార పార్టీ అండతో చెలరేగిపోయే అధికారులు, అదే విధంగా అరాచకత్వానికి పాల్పడే పోలీసులు పై ఉక్కుపాదం మోపే విధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారనే చెప్పవచ్చు. అధికారులు, పోలీస్ వ్యవస్థ పని తీరు పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఈ అధికారులు, అదే విధంగా పోలీసుల అతి ప్రవర్తన పైన, ఆగ్రహం వ్యక్తం చేసారు. వీరి పైన దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వస్తున్న, ఫిర్యాదులను పరిష్కరించటానికి, అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లతో, వారి నేతృత్వంలో ఒక స్థాయి సంఘం ఏర్పాటు చేయాలన్న ఆలోచన తనకు ఉన్నట్టుగా, జస్టిస్ ఎన్వీ రమణ తన ఆలోచనను బయట పెట్టారు. ప్రస్తుతానికి ఈ స్థాయి సంఘం ఏర్పాటుకు సబందించిన ఉత్తర్వులు జారీ చేయకపోయినా, భవిష్యత్తులో, ఒక స్థాయి సంఘం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు.
అధికార పార్టీ అండతో చెలరేగిపోతున్న అధికారులు, పోలీసులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారు, అధికార పార్టీ అండ చూసుకుని సామాన్యుల పైన ప్రతాపం చూపించే పోలీసుల పైన చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వ్యాఖ్యలు, ఈ రోజు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ మాజీ ఏడీజీపీ గుర్జిందర్ పాల్ సింగ్ కేసుకు సంబందించిన కేసు విచారణ సందర్భంగా, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్తులో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. అయితే అధికార పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయే అధికారులు, పోలీస్ ఆఫీసర్లకు న్యాయ వ్యవస్థ రక్షణగా ఉండదనే విషయం గుర్తు పెట్టుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అధికారులు, వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇలాంటి వారికి కోర్టుల్లో రక్షణ ఉండదని అన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ధోరణి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు హైకోర్ట్, ఈ విషయం పై ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.