రిటైర్డ్ అయ్యే ముందు కూడా, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్ కూడా కష్టాలు తప్పటం లేదు. మరో వారంలో ఆయన తన సర్వీస్ కు రిటైర్డ్ అవ్వనున్నారు. ఇప్పటికే కొత్త చీఫ్ సెక్రటరీ కూడా వచ్చారు. అయితే రిటైర్డ్ అయ్యే ముందు కూడా ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది. నరేగా పనులకు నిధులు చెల్లించటం లేదని ఈ రోజు హైకోర్టులో దాఖలు అయిన పిటీషన్ ల పై విచారణ జరిగింది. మొత్తం 500 పిటీషన్లు దాఖలు అయ్యాయి. దీని పై ఈ రోజులో జస్టిస్ గట్టు దేవానంద్ బెంచ్ ముందు విచారణ జరిగింది. ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ హాజరు అయ్యారు. అయితే ఈ పనులు పై విజిలేన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుందని, గతంలో అధికారులు చెప్పారని, అటువంటి విచారణ ఏదైనా జరుగుతుందా అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ఏమి ఈ పనులు పై జరగటం లేదని, చెప్పి చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాద్ దాస్ చెప్పారు. అయితే చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాద్ దాస్ చెప్పిన దాన్ని రికార్డు చేయాలని హైకోర్టు స్పష్టం చేయటంతో, ఆయన స్టేట్మెంట్ ని రికార్డు చేసారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా తాము ఏపిలో చేసిన నరేగా పనులకు సంబంధించి బిల్లులు మొత్తం చెల్లించామని, కోర్టుకు స్పష్టం చేసింది. అదే విధంగా, నరేగా పనులు పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పి, స్పష్టం చేసింది. పిటీషనర్ తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాస రావు, వాదనలు వినిపించారు. ఆయన వాదనలు వినిపిస్తూ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతున్నా కూడా, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కు పంపించి, ఆ తరువాత CMSFకి బిల్లులు పంపారని చెప్పి, ప్రస్తుతం మళ్ళీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ఏమి జరగటం లేదని చెప్పటం పై కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ నెల 29వ తేదీన ఈ కేసుకు సంబంధించి తుది ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేస్తూ, కేసు విచారణను ఈ నెల 29వ తేదికి వాయిదా వేసింది. దీంతో చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయ్యే ముందు రోజు, ఈ కీలక కేసు విచారణకు రానుంది. మరి ఆ రోజు ఏమి జరుగుతుందో, ఏమి అవుతుందో చూడాల్సి ఉంది.