శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారిని చూసేందుకు వచ్చిన చిన్నారి సీఎంని ఆటోగ్రాఫ్ అడగగా వెంటనే చిన్నారి తెచ్చుకున్న పుస్తకంలో తన సంతకం చేసి ఇచ్చారు. చిన్నారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం పర్యటించారు. సోంపేట, కవిటి, ఇచ్చాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారికి కనీసం అన్నం పొట్లాలు కూడా అందలేదన్న వాస్తవాన్ని తెలుసుకుని ఒకరోజు పర్యటనగా వచ్చిన బాబు తిత్లీ బాధితులతోనే పలాసలో శుక్రవారం రాత్రి గడుపుతానంటూ వెల్లడించారు.

chinnari 13102018 2

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయడం, రోడ్డులపై పడి ఉన్న భారీ చెట్లు తొలగించడంతోపాటు అత్యవసర సర్వీసులన్నీ పునరుద్ధరణ చేసేవరకూ తాను పలాసలోనే మకాం వేస్తానంటూ చెప్పడంతో రాజధాని నుంచి సిక్కోల్ వరకూ అధికార యంత్రాంగం అంతా ఆయన వెంటే పరుగులు పెడుతున్నారు. తిత్లీ తుపాను బాధిత గ్రామాల్లో తక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం తిత్లీ తుపాను బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. డీఎస్పీ కార్యాలయం మైదానంలో సి.ఎం. హెలీకాఫ్టర్ ల్యాండ్ అనంతరం అక్కడ నుంచి నేరుగా పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం బయలుదేరి రోడ్డుమార్గంలో వెళుతూ ప్రజల హర్షధ్వానాలకు సి.ఎం. కారు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు.

chinnari 13102018 3

పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కారు దిగి అక్కడపడి ఉన్న చెట్లను పరిశీలించి చెట్లు తొలగింపునకు కలెక్టర్ కె.్ధనంజయరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. కాశీబుగ్గ బస్ స్టేషన్ వద్ద దిగి అక్కడ కూలిన చెట్లను పరిశీలించి చెట్ల తొలగించాలని స్థానిక అధికారులకు హుకుం జారీ చేశారు. అక్కడ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ నుంచి బయలుదేరి వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామం వెళుతూ మార్గ మధ్యలో తుపానుకు నష్టపోయిన జీడితోటలను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా అక్కుపల్లి చేరుకుని గ్రామస్థులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. పిల్లలకు భోజనాలు పెట్టాలని, పేద వారందరికీ రేషన్ షాపుల ద్వారా 25 కేజీల బియ్యం, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం ఈ రోజును నుంచే తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. తాగునీరు, విద్యుత్‌లకు ఇబ్బంది పడుకుండా తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రహదారులు, ఇతరత్రా సౌకర్యాలు కూడా త్వరలోనే కల్పించనున్నట్లు వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read