‘‘రాష్ట్రవ్యాప్తంగా 98 లక్షల మంది చెల్లెమ్మలు ఉన్న నేను ఎంతో అదృష్టవంతుడిని. మీ తోబుట్టువులు, కన్నవారు ఎన్నిసార్లు పసుపు-కుంకుమ పెట్టారో తెలియదు. నేను బతికున్నన్ని రోజులు మీకు పసుపు కుంకుమ కానుక ఇస్తూనే ఉంటా’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడపడుచులకు హామీ ఇచ్చారు. రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ శాశ్వతంగా అమలు చేస్తామన్నారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఎన్నికల ప్రచార సన్నాహక శంఖారావంలో భాగంగా పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత... నూజివీడు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘‘నేను బతికి ఉన్నన్ని రోజులు మీకు పసుపు కుంకుమ అందుతుంది. ఇదే విషయాన్ని మీ అత్తమామలకు చెప్పండి. చంద్రన్న మాకు జీవితాంతం భరోసా ఇస్తున్నాడని చెప్పండి. ఆడపడుచు సౌభాగ్యంతోనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది’’ అని చంద్రబాబు తెలిపారు.

mp 21032019

‘రాష్ట్రం కోసమే మోదీతో పొత్తు పెట్టుకున్నాను. కానీ, నమ్మక ద్రోహం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు! ప్యాకేజీ అన్నారు.. అదీ ఇవ్వలేదు’ అని ఆక్రోశించారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాలని నాడే కంకణం కట్టుకున్నానని తెలిపారు. పండించిన పంటలకు సరైన ధరలు లేక, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారని... ఒక రైతు బిడ్డగా వారి సమస్యలను తెలుసుకుని, దేశంలో మరే ప్రభుత్వం చేయని విధంగా రూ.24,500 కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు. మరికొంత సొమ్ము మాత్రమే రావాల్సి ఉందని... ఎన్నికల్లోపు అది కూడా రైతుల ఖాతాలో పడుతుందని చెప్పారు. ‘‘అన్నదాతా సుఖీభవ శాశ్వతంగా అమలవుతుంది. రైతాంగానికి ఇంత చేస్తున్నందున తెలుగుదేశం పార్టీని రైతులు ఆశీర్వదించాలి’’ అని కోరారు. పింఛను రూ.2 వేలకు పెంచి... ప్రతి ఇంటికీ పెద్దకొడుకుగా ఉంటానన్న మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో 11 లక్షల గృహ ప్రవేశాలు జరిగాయని... మొత్తం 29 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు.

 

mp 21032019

‘‘2019 ఎన్నికలు ప్రజా ఎన్నికలు కావాలి. 5 కోట్ల మంది ఒకేతాటిపైకి రావాలి. 25 లోక్‌సభ స్థానాలు సొంతం చేసుకుని... కేంద్రంలో పట్టు సాధించాలి’’ అని పేర్కొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది జూలై నాటికి మెట్టప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ‘‘నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఇక వెనుతిరగను. ఆ పని సాధించి తీరుతా. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. 62 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం’’ అని ప్రకటించారు. నామినేషన్ల విషయంలో జాగ్రత్త... ‘‘ఇప్పుడు ధర్మపోరాటానికి దిగుతున్నాం. నామినేషన్లలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించండి. ఎదుటివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకండి. కుట్రదారులు పొంచి ఉన్నారు జాగ్రత్త’’ అని పార్టీ అభ్యర్థులను చంద్రబాబు అప్రమత్తం చేశారు. ఏలూరు టీడీపీ కార్యాలయం నుంచి బుధవారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరు టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రమాణం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంపీ అభ్యర్థులు శివరామరాజు, మాగంటి బాబుతో సహా 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో బాబు తన సమక్షంలోనే ప్రమాణ పత్రం చదివించారు. అభ్యర్థులందరికీ ఆయనే బి- ఫామ్‌ అందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read