ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఏమి మాట్లాడతారో అంతా సస్పెన్స్ గా ఉంటుంది. ఒక శాఖ గురించి మాట్లాడాల్సిన మంత్రి, ఇంకో శాఖ గురించి చెప్తారు. మంత్రులు మాట్లాడాల్సింది సలహాదారులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా పోలీసులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, ప్రతికపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేయటం కొత్త సంస్కృతి. నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ గారు, ప్రెస్ మీట్ పెట్టి, మా దగ్గర ఒక యాప్ ఉంది, అందులో ఎవరి పేరు కొట్టినా, వారి పైన ఎన్ని కేసులు ఉన్నాయో వచ్చేస్తాయి అని చెప్పారు. ఇక్కడ వరకు బాగనే ఉంది. అయితే దీనికి ఉదాహరణగా, చింతమనేనిని ప్రస్తావించారు. చింతమనేని పేరు కొట్టాలని చెప్పి, ఆయన పై 84 కేసులు ఉన్నాయి అంటూ, అందరి ముందు షేం చేసే ప్రయత్నం చేసారు. ఆయన వనజాక్షిని కొట్టారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేసులు అంటే గుర్తుకు వచ్చే వాళ్ళ పేర్లు కాకుండా, చింతమనేని పేరు చెప్పటం, ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడటం పై అందరూ ఆశ్చర్య పోయారు. అయితే చింతమనేని డీజీపీ వ్యాఖ్యలకు ఈ రోజు మీడియా సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చారు. డీజీపీ తన పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. తాను ఏమి మ-ర్డ-ర్లు చేయలేదని , అవినీతి కేసులు, ఫోర్జరీ కేసులు, ఇలాంటి కేసులు ఒక్కటీ తన పైన లేదనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.
ప్రజల కోసం పోరాటం చేసే విషయంలో అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా చెప్తున్నారని, ఇలాంటి అక్రమ కేసులు 84 కాదు 800 కేసులు పెట్టుకోవచ్చని చింతమనేని అన్నారు. తన పేరుని కొట్టి చూపిస్తున్న డీజీపీ గారు, 6093 అనే నంబర్ ని కొట్టి ఉంటే, అక్రమ ఆస్తుల కేసులో ఉన్న వారి కేసులు లిస్టు ఒక పెద్దది వచ్చేదని, అది మంచి ఉదాహరణగా ఉండేదని చింతమనేని అన్నారు. మాట్లాడితే వనజాక్షి కేసు గురించి చెప్తారని, వనజాక్షి ని నేను కొ-ట్టి-న-ట్టు ఎక్కడైనా ఆమె ఫిర్యాదు చేసిందా అని అడిగారు ? ఆమె ఇచ్చిన కంప్లైంట్ లో తన పై డ్వాక్రా మహిళలు దా-డి చేసినట్టు ఉందని, ఇప్పటికీ ఆ కేసు తప్పు అయితే, డీజీపీ కేసు రీ ఓపెన్ చేసి, ఏమైనా చేసుకోవచ్చు అంటూ చాలెంజ్ చేసారు. బయటకు వస్తే కేసు, మాట్లాడితే కేసు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, ఎవరి ఆనందం కోసం, నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ డీజీపీని ప్రశ్నించారు. మొన్న నర్సీపట్నం అడువుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి తిప్పారని, అదే చివరి రోజు అనుకున్నా అని, ఈ మొత్తం అంశాల పై కోర్టుకు వెళ్తున్నానని చింతమనేని అన్నారు.