పశ్చిమగోదావారి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని వైసీపీ ప్రభుత్వం ఎలా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే. బహుసా చంద్రబాబు కంటే, ఎక్కువ టార్గెట్ చేసారు అనటంలో సందేహం లేదు. మిగతా టిడిపి నాయకులతో పోల్చితే, చింతమనేని ఎక్కువ టార్గెట్ అయ్యారు. ఆయన దూకుడు స్వభావం, వైసీపీకి కలిసి వచ్చింది. ఒక కేసులో బెయిల్ వస్తే, ఇంకో కేసులో అరెస్ట్ చూపించటం, అందులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చూపించటం, ఇలా కొన్ని నెలలు చింతమనేనిని జైల్లోనే ఉంచారు. అయితే అవన్నీ ప్రేరేపిత కేసులు కావటంతో, చివరకు బెయిల్ రాక తప్పలేదు. అప్పటి నుంచి చింతమనేని తన ఫ్లో లో తాను వెళ్తూ, ప్రభుత్వ విధానాల పై పోరాడుతూ, నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే తాజాగా వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో, మొదటి విడతలోనే దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మొదటి విడత ఎన్నికలు, చివరకు వాయిదా పడటంతో, నాలుగో విడతలో దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మికంగా తీసుకున్న చింతమనేని, తన సత్తా ఏమిటో చటటానికి సిద్ధం అయ్యారు. అందుకు తగ్గట్టే ఆయన చేసే ప్రయత్నాలకు, ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తు, కోలాహలంగా ప్రచారం జరుగుతుంది.
ఇలా చింతమనేని ప్రచారంలో దూసుకుని వెళ్లిపోతుంటే తమకు ఇబ్బంది అనుకున్నారో ఏమో కానీ, వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. చింతమనేనిని మళ్ళీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే ప్లాన్ వేసారు. ఇందులో భాగంగా, చింతమనేని ప్రచారం ముగించుకుని వెళ్ళిన తరువాత, టిడిపి, వైసీపీ నేతలు కొట్టుకుంటే, అక్కడ లేని చింతమనేని పై నిందలు మోపి కేసు పెట్టారు. చింతమనేని ప్రచారంలో ఉండగా, ఆయన కార్ వెంట పడి, ఎలా అరెస్ట్ చేసారో మొన్న సోషల్ మీడియాలో చూసాం. అయితే చింతమనేని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించే ప్లాన్ వేయగా అది బెడిసికొట్టింది. చింతమనేనిని జడ్జి ముందు ప్రవేశపెట్టి పోలీసులు రిమాండ్ అడిగారు. అయితే ఆధారాలు చూపించమని జడ్జి అడగగా, పోలీసులు ఆధారాలు చూపించటంలో ఫెయిల్ అయ్యారు. దీంతో సరైన ఆధారాలు లేకుండా ఎలా రిమాండ్ కు పంపిస్తాం అని, వెంటనే ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయాలని జడ్జి చెప్పటంతో, అరెస్ట్ కుట్రకు ప్లాన్ చేసిన పెద్దలు అవాక్కయ్యారు. అయితే తరువాత చింతామనేని తనను అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పే దాకా, ఇక్కడ నుంచి వెళ్ళను అని స్టేషన్ లో భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఇంటికి తరలించారు.