ఈ రాష్ట్రంలో టిడిపి పార్టీకి చెందిన వాళ్ళు మంచి పని చేసినా తప్పు అయిపొయింది. తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అంటుంటే, వైసీపీ నేతలు మాత్రం, టిడిపి మంచి పని చేసినా ఊరుకునేది లేదనే విధంగా రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళ పని, ప్రతిపక్ష పార్టీ చేస్తుంటే మేచ్చుకోవలసింది పోయి, మీరెలా చేస్తారు అంటూ అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చాలా వరకు రోడ్డులు అన్నీ గుంతల మయం అయిపోయాయి. పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు రూ.1 వరకు రోడ్డు అభివృద్ధి సెస్ కింద వసూలు చేస్తున్నారు. మరి ఆ డబ్బులు అన్నీ ఏమైపోతున్నాయో తెలియదు. రాష్ట్రం మొత్తం పరిస్థితి ఉన్నట్టే, ఏలూరులో కూడా రోడ్డుల పరిస్థితి ఇలాగే ఉంది. రెండు రోజుల నుంచి వర్షాలు కూడా పడుతూ ఉండటంతో, రోడ్డుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ నీళ్ళు నిలిచి పోవటంతో, ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో కూడా తెలియని పరిస్థితి. ఏలూరులో కొన్ని ప్రధానమైన రోడ్డులు అధ్వానంగా ఉండటం, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండటం, అధికారులు పట్టించుకోకపోవటం, టిడిపి మాజీ ఎమ్మెల్యే రంగంలో దిగి, ఎక్కడైతే రోడ్డులు పాడైపోయాయో అక్కడ మరమ్మత్తులు చేస్తే ప్రయత్నం చేసారు.

chintamananeni 12072021 2

రోడ్డు పైన రబ్బిష్ పోసి, గుంటలు పూడ్చే ప్రయత్నం చేసారు. నిన్న ఉదయం పెద్ద ఎత్తున వర్షం పడుతున్నా సరే, వర్షంలో తడుస్తూనే, రోడ్డు మరమ్మత్తు పనులు చేసారు. చింతమనేని ప్రభాకర్ తో పాటుగా, కొంత మంది టిడిపి కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా వచ్చి, రోడ్డు మరమ్మత్తులు చేసారు. అయితే మంచి చేస్తుంటే మెచ్చుకోవాలి కాని, ఒక వైసీపీ నాయకుడు వచ్చి, అడ్డుకున్నాడు. మీరెలా చేస్తారు అంటూ వాగ్వాదానికి దిగాడు. అక్కడ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. అయితే చింతమనేని ప్రభాకర్, కావలని గొడవ పెట్టుకుని కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని గమనించి, ఎలాంటి గొడవ పెట్టుకోకుండా, రోడ్డు మరమ్మత్తులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సమయంలో మరి కొంత మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి, టిడిపి వారితో గొడవ పడ్డారు. టిడిపి నేతలు పని అయిపోయి వెళ్ళిపోతున్నా, వెంటపడి మరీ రెచ్చగొట్టారు. అయితే పోలీసులు వచ్చి సర్ది చెప్పారు. ఎలాగైనా రెచ్చగొట్టి కేసు పెట్టాలనే ప్రయత్నంలో వైసిపీ నేతలు వచ్చి అడ్డుకున్నా చింతమనేని ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read