ఈ రోజు అమెరికాలోని డల్లాస్ నగరంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సంస్థ (మా-MAA) తమ సిల్వర్‌జూబిలీ ఉత్సవాలను, ఘనంగా నిర్వచించేందుకు ప్లాన్ చేసింది... ఆ ఉత్సవాలకు రావటానికి, టికెట్ పెట్టటమే కాక, నిధుల సమీకరణకు కూడా మా ముందుకు వచ్చింది... 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని డాలస్‌లో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న డల్లాస్ ప్రవాసాంధ్రులు మాత్రం, ఈ ఉత్సవాలకు సహకరించేది లేదని ముందు నుంచి చెప్తున్నారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకహోదా, నిధుల కేటాయింపు, విభజన చట్టం హామీల అంశాల్లో కేంద్రప్రభుత్వం చేతిలో వంచనకు గురైనా, చిరంజీవిగారు మరియు ఇతర సినిమాతారలెవరూ ఆంధ్రుల నిరసనకు మద్దతు తెలిపుతూ కనీస సంఘీభావ ప్రకటన కూడా చేయలేదనే కోపంతో, డల్లాస్ ప్రవాసాంధ్రులు, ఈ కార్యక్రమంలో నిరసన తెలిపి, చిరంజీవికి తన కర్తవ్యం గుర్తు చేసారు... విభజన హామీ విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతున్నా సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం పై డల్లాస్ లోని ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు... నిరసన చేస్తున్న ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ, ఆంధ్రా నుంచి ‘మా’ అసోసియేషన్ తరఫున భవనం నిర్మించడానికి ఫండ్స్ కోసం తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొంతమంది వచ్చారని, మేము దానికి వ్యతిరేకం కాదని, ఇలాంటి వాటికి చాలా విరాళాలు ఇచ్చామని, ఇదే శ్రద్ధ, మన రాష్ట్రము మీద సినీ పెద్దలకు ఎందుకు లేదని అడిగారు. ప్రధానంగా లోటుబడ్జెట్‌లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు హోదా, విభజన హామీల విషయంలో సినీ పరిశ్రమ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
కావేరి, జల్లికట్టు విషయంలో తమిళనాడు రాష్ట్రం మొత్తం ఏకమైందని, ఆ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని వారన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయనా? ఏపీలో ఏమీ లేవనా? అని ప్రశ్నించారు. ఇక్కడ మీకు ఫండ్స్ కలెక్ట్ చేసి ఇస్తుంటే, ప్రజలగురించి ఒక్క మాటకూడా మాట్లాడరా అంటూ ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. ప్రధానంగా తమ ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెప్పాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి ఏం చేశారని వారు నిలదీశారు. పార్లమెంట్‌లో, పక్క రాష్ట్రాలు ఏపీకి మద్దతుగా మాట్లాడుతుంటే... చిరంజీవి ఆడియో ఫంక్షన్లకు, కుటుంబ సమస్యల కోసం మా అషోసియేషన్‌కు గుంపును పోగేసుకునివెళ్లినంత శ్రద్ధ.. ఏపీపై ఎందుకు చూపడంలేదని ప్రవాసాంధ్రులు ప్రశ్నించారు. ఏపీ ప్రజలు సినీ పరిశ్రమను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారని, అలాంటిది కష్ట సమయంలో, ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడంలేదని వారు ప్రశ్నించారు.