దాసరి నారయణరావు మరణం తరువాత, టాలీ వుడ్ లో, పెద్ద దిక్కు కోల్పోయాం అనేది సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి అన్నిట్లో ఉండటం, ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఉండటం చేస్తున్నారు. అందరినీ కలుపుకుని వెళ్ళటం లేదు, నలుగురుని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. దాసరి తరువాత ఆ స్థానాన్ని చిరంజీవి భర్తీ చేస్తున్నారనే అందరూ అనుకులే చిరంజీవి అన్నిట్లో ముందుకు వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న వైఖరితో, సినీ ఇండస్ట్రీలో సంక్షోభం వచ్చింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వంతో చర్చలు జరపటానికి మాత్రం, ఎవరూ ఇండస్ట్రీ నుంచి ముందుకు రాలేదు. అసలు చిరంజీవి అడిగితేనే ఆన్లైన్ టికెట్లు పెట్టాం అని ప్రభుత్వం కూడా చెప్పింది. ఈ నేపధ్యంలో చిరంజీవి పై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. జగన్ తో చిరంజీవి చర్చలు జరుపుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఈ రోజు చిరంజీవి ఒక కార్యక్రమంలో పాల్గుని, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను సినీ పెద్దగా ఉండను అని, ఆ పదం నాకు ఇష్టం లేదని, ఇద్దరి మధ్య గొడవలు నేను తీర్చలేనని, ఇండస్ట్రీ మొత్తం బాగు కోసం, ఏమైనా చేయమంటేనే చేస్తాను కానీ, అన్నిట్లో పులుముకొనని అన్నారు.
ఆయన ఏమన్నారు అంటే, "పెద్దరికం అనేది, ఒక హోదా గానో, అలా అనిపించుకోవటమో నాకు ఇష్టం ఉండదు. నేను సినీ పెద్దగా ఉండను. కానీ బాధ్యతగల బిడ్డగా మాత్రం ఉంటాను. అసవరం వచ్చినప్పుడు అడిగితే వస్తాను. కానీ అనవసరంగా మాత్రం, అన్నిటికీ ముందుకు వచ్చే ప్రసక్తే లేదు, ముందుకు రాను, ఉండను, ఆ సినీ పెద్ద హోదా నాకు వద్దు. అవసరం వస్తే, నేను భుజం కాయాల్సి వస్తే మాత్రం, నేను ఉంటాను. కానీ ఇద్దరు ఎవరో వచ్చి కొట్టుకుంటే, ఆ తగువులు మాత్రం నేను తీర్చను. అవసరం మేరకు, అయితే ఉపాధి పరంగా, ఆర్ధిక పరంగా, ఆరోగ్య పరంగా సమస్యలు ఉంటే నేను ఉంటాను తప్ప, సమగ్రంగా పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని ఉంటాను కానీ, ఇద్దరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని, నన్ను తీర్చమంటే నేను తీర్చను. ఇలాంటి పంచాయతీలు నేను చేయను. ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవటం నాకు ఇబ్బంది. కార్మికుల కోసం మాత్రం ఏదో ఒకటి చేస్తాను." అని చిరంజీవి అన్నారు.