విజయవాడలో నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొననున్న ఉమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సహా ఇతర సీనియర్ నేతలు పాల్గున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. ఏపీలో కాంగ్రెస్ పునర్‌నిర్మాణం దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా అంశానికి కట్టుబడి ఉన్నాం అని, హోదా విషయంలో రెండు ప్రభుత్వాలు విఫలం చెందాయని, రాష్ట్రంలో ధరల భారంపై జులై 7 నుంచి 17 వరకు నిరసనలు చేస్తున్నామని, అసలు అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఉమెన్ చాందీ అన్నారు. అయితే ఈ సందర్భంగా విలేఖరులు చిరంజీవి గురించి అడగగా, ఆయన ఇప్పుడు తమతో లేరని, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గునటం లేదని చెప్తూ, పార్టీకి దూరం జరిగారు అనే విధంగానే సమాధానం చెప్పారు. అయితే, ఈ విషయం పై, ఈ రోజు మళ్ళీ మాట మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ మాట్లాడుతూ, చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఏఐసీసీ, ఏపీసీసీ స్పష్టీకరణ చేసినట్టు చెప్పారు. సినీ రంగంలో చిరంజీవి బిజీగా ఉండటం వల్లే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని మాత్రమే ఉమెన్ చాందీ అన్నారుని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాదే అని భవిష్యత్ లో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయి అంటూ శైలజానాథ్ చెప్పుకొచ్చారు.
చిరంజీవి పై, మళ్ళీ మాట మార్చిన కాంగ్రెస్...
Advertisements