ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో, కేంద్రం చేస్తున్న అన్యాయం పై ప్రజలు ఎలా ఆందోళన చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం... ఇటు రాజకీయంగా, మోడీ చేస్తున్న అన్యాయం దేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో, చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో, దేశ రాజకీయాల్లోనే ఒక కుదుపు వచ్చింది.... అన్ని విపక్షాలను, ఈ విషయంలో చంద్రబాబు ఏకం చేసి, ఢిల్లీని ఇబ్బంది పెడుతున్నారు... అదే సందర్భంలో, బీజేపీ, ఇక్కడ కొంత మందిని అడ్డు పెట్టుకుని, చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తూ, కేసులు పెడతాం అంటూ భయపెడుతున్నా, చంద్రబాబు మాత్రం, ఈ కుట్రలని ఎదుర్కుని ఢిల్లీ పై యుద్ధం చేస్తున్నారు..
ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన సినీనటుడు, కాంగ్రెస్ ఎంపీ, ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత కె.చిరంజీవి మాత్రం సెలవుల్లో ఉన్నారు... ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశా లకు వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నట్లు చిరంజీవి తనకు లేఖ రాశారని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభలో వెల్లడించారు. ఈ నెల 5 నుంచి ఏప్రిల్ 2 వరకు సెలవులు కావాలని చిరంజీవి కోరుతున్నారని, సభ ఆమోదం కావాలని వెంకయ్య అనగానే, సభ్యులు అంగీకరించారు.
నిజానికి చిరంజీవి, మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత, ఏ నాడు, మన సమస్యలు గురించి పట్టించుకోలేదు... మొన్నటి దాక అంటే వేరు, ఇప్పుడు అవిశ్వాసం లాంటివి పెట్టి, కేంద్ర ప్రభుత్వాన్ని డీ కొడుతున్న సమయంలో కూడా, చిరంజీవి ఆంధ్రప్రదేశ్ సమస్యల పై పట్టించుకోవటం లేదు... అయితే, అందరి మీద విరుచుకుపడే పవన్ కళ్యాణ్, చిరంజీవి విషయంలో మాత్రం నోరు పడి పోయింది... నేషనల్ మీడియాకి ఎక్కి మరీ, చంద్రబాబుని బలహీనపరుస్తూ, అవిశ్వాస తీర్మానం డ్రామా అంటూ చెప్తున్నారు కాని, చిరంజీవి చేస్తున్న ద్రోహం మాత్రం, పాపం పవన్ కళ్యాణ్ గారికి కనిపించటం లేదు...