మెగాస్టార్ చిరంజీవి, తన తదుపరి భారీ బడ్జెట్ సినిమా, సైరా నరసింహారెడ్డి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయాన అనేక చోట్ల ప్రమోషన్లు చేస్తూ , సినిమాని ప్రోమోట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన ఆనంద వికటన్ అనే ఒక ప్రముఖ తమిళ్ మ్యాగజైన్ కి ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలతో పాటుగా, ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేసారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ వైఫల్యంగా గురించి వ్యాఖ్యలు చేసారు. డైరెక్ట్ గా చెప్పకపోయినా, తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమలహాసన్ లకు తన సూచనగా, జనసేన, పవన్ కళ్యాణ్ వైఫల్యం గురించి చెప్పారు. అయితే ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో, అటు పవన్ కళ్యాణ్ కి కూడా ఇవే సూచనలు ఇన్ డైరెక్ట్ గా చేసారా అని ఫాన్స్ గుసగుసలాడుకుంటున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ, "నేను రజనీకాంత్, కమలహాసన్ లకు ఒకే సలహా ఇస్తున్నా, మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి. ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని సలహా ఇస్తున్నా. నేను పార్టీ పెట్టాను, నా తమ్ముడు పార్టీ పెట్టాడు, మా ఇద్దరినీ ఈ కులం, ధనమే ఓడించాయి. ఓటమి, అవమానాలు, ఇలాంటివి అందరూ పేస్ చెయ్యాల్సిందే. కాని నా లాంటి సున్నిత మనస్తత్వం ఉన్న వాళ్ళకు ఇది ఎదుర్కోవటం కష్టం. నా లాంటి వాడే రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టె పరిస్థితి. ఇలాంటివి నా వళ్ళ కాదు." అంటూ తాను, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓడిపోవటానికి కారణాలు చెప్తూ, రాజకీయాల్లోకి రావద్దు అంటూ, చిరంజీవి చెప్పుకొచ్చారు.
కమలహాసన్ ఇప్పటికే మక్కల్ నీధి మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ త్వరలోనే తన పార్టీని ప్రకటించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన మిత్రులిద్దరికీ చిరంజీవి ఈ మేరకు సలహా ఇచ్చారు. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి, చివరకు కాంగ్రెస్ లో కలిపేసారు. తన కేంద్ర మంత్రి పదివి పోగానే, రాజకీయాలకు దూరం అయిపోయి, మళ్ళీ సినిమాలు తీసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టి, ఎన్నో మాటలు చెప్పి, మొన్నటి ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే తెచ్చుకున్నారు. అటు చిరంజీవి పార్టీ వల్ల కాని, ఇటు పవన్ పార్టీ వల్ల కాని, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దెబ్బ పడి, అప్పట్లో వైఎస్ఆర్, మొన్న జగన్ గెలిచిన సంగతి తెలిసిందే.