మోహన్ బాబు తర్వాత విద్యా రంగంలోకి మరో సినీ కుటుంబం అడుగు పెడుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రారంభిస్తున్నారు. అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నామని సీఈవో జె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇచ్చేందుకు ప్రప్రథమంగా శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ను అన్ని సదుపాయాలతో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

chiru 12052019 1

ఏసీ క్లాస్ రూమ్ లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ, పేరెంట్-టీచర్ ముఖాముఖి, ఇంగ్లిష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలని వివరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా తరగతులను నిర్వహించనున్నట్టు చెప్పారు. వర్తమాన పోటీ ప్రపంచంలో చిన్నతనం నుంచే విద్యార్థులకు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాంకేతిక అంశాలతో పాటు తార్కిక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యం, నైపుణ్యాలలో శిక్షణ, సమస్యల పరిష్కారం, కంప్యూటర్స్ లోని ప్రాథమిక, ఆధునిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా స్టూడెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఎస్టీఈపీ) ద్వారా అత్యాధునిక శిక్షణ ఇవ్వనున్నారు.

chiru 12052019 1

ఈ స్కూల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబు గౌరవ చైర్మన్ గా ఉంటారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గౌరవ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఈ స్కూల్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకి ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని సీఈవో జె శ్రీనివాసరావు తెలిపారు. చిరంజీవి అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరంజీవి లాంటి పెద్ద స్టార్ స్కూల్ పెట్టటం, లేదా ఒక వ్యాపారం చెయ్యటం హర్షణీయం. అయితే ఇదే సందర్భంలో హైదరాబాద్ నుంచి వచ్చి, మోహన్ బాబు లాగా, ఇక్కడే వ్యాపారాలు చేసుకుని, ఇక్కడ ప్రభుత్వాన్ని అకారణంగా టార్గెట్ చెయ్యటం లాంటివి చూసిన ప్రజలు మాత్రం, చిరంజీవి ఇలా చెయ్యకుండా, ఏపి రాష్ట్ర పేరు నిలబెట్టేలా స్కూల్ నడిపితే మంచిదని ప్రజలు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read