జగన్ మోహన్ రెడ్డి, మూడు రోజుల వ్యవధిలో, రెండు సార్లు ఢిల్లీ వెళ్ళటం పై, అనేక చర్చలు జరుగుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది, రాజకీయ అవసరాల కోసం అని, అటు బీజేపీ కూడా, తమ రాజకీయం కోసమే, జగన్ ని పిలిపించిందనే వార్తలు వస్తున్నాయి. త్వరలో జరగబోయే, కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో, జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ పార్టీని కూడా తీసుకునే విషయంలోనే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారానికి, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, మరింత బలం చేకురుంది. కేంద్ర మంత్రి వర్గంలో, వైసీపీకి, రెండు నుంచి మూడు మంత్రి పదవులు దక్కే అవకాసం ఉందని తెలుస్తుంది. విజయసాయి రెడ్డితో పాటుగా, బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్ తో పాటు, మరోకరకు మంత్రి పదవి ఇచ్చే విషయం పై, చర్చలు జరుగుతున్నాయని సమాచారం వస్తుంది. గత వారం పది రోజుల నుంచి ఈ జరుగుతున్న ఈ ప్రచారం, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటంతో, మరింత ఊపు అందుకుంది.
అయితే ఇదే విషయం పై, నిన్న రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణను, మీడియా ప్రశ్నించింది. కేంద్ర మంత్రి వర్గంలో, వైసీపీ చేరుతుంది కదా అని విలేఖరులు ప్రశ్నించగా, బొత్సా ఆచి తూచి స్పందించారు. తాము ఇప్పటికే కేంద్రంలోని మోడీ సారధ్యంలో ఉన్న ప్రభుత్వానికి, అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. మొన్నటి దాక, జగన్ కు ఢిల్లీలో అప్పాయింట్మెంట్ లేదు అని చెప్పిన పత్రికలే, ఈ రోజు బీజేపీ, వైసీపీ దగ్గర అవుతున్నాయని రాస్తున్నాయని బొత్సా అన్నారు. కేంద్రంతో తాము ఎందుకు గొడవ పెట్టుకుంటామని అన్నారు. తాము కేంద్రంతో ఏమి రాసుకుని పూసుకుని తిరగటం లేదని, అలాగని, వారితో పూర్తిగా వైరం పెట్టుకోలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని, దాని కోసం, ఎంత వరకు అయినా వెళ్తాం అని, ఎవరి గడ్డెం అయినా పట్టుకుని బ్రతిమలాడతాం అని బొత్సా అన్నారు. రాష్ట్రానికి నష్టం అనుకుంటే, దాని జోలికి వెళ్ళాం అని అన్నారు. కేంద్రంతో వైసీపీ కలిస్తే, రాష్ట్రానికి మేలు అనుకుంటే, ముందుకు వెళ్తాం అని అన్నారు. ఇక చిరంజీవికి వైసీపీ కోటాలో రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నారు కదా అని ప్రశ్నించగా, దీని పై కూడా బొత్సా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పార్టీ ప్రయోజనాలకు ఏది మంచి నిర్ణయం అయితే అది తీసుకుంటామని, పార్టీ బలోపేతానికి పనికొచ్చే నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్ది తీసుకుంటారని, మరో రెండు నెలలు పొతే, ఎవరికీ సీట్ ఇచ్చేది, చెప్తామని, ముందుగానే, ప్రయారిటీ లిస్టు చెప్పలేం కదా అని బొత్సా అన్నారు.