మెగా స్టార్ట్ చిరంజీవి, గత 6 ఏళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రజా రాజ్యం పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్ లో కలిపేసి, అప్పట్లో రాజ్యసభ, కేంద్ర మంత్రి పదవి తీసుకున్న చిరంజీవి, ఆ పదవులు ఉన్నంత కాలం కాంగ్రెస్ లో ఆక్టివ్ గా ఉన్నారు. ఎప్పుడైతే పదవి పోయిందో, అప్పుడే రాజకీయాలకు దూరం అయ్యారు. 10 ఏళ్ళ తరువాత, అమ్మడు కుమ్ముడు అంటూ 150వ సినిమాలో డాన్స్ లు వేసారు. అప్పటి నుంచి చిరంజీవి రాజకీయాలు మాట్లాడింది, చాలా తక్కువ. ఒకసారి చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, ముద్రగడ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పాల్గున్నారు. తరువాత మొన్న జగన్ గెలిచిన తరువాత, వెళ్లి కలిసి భోజనం చేసారు. అయితే ఇప్పుడు తాజగా చిరంజీవి, రెండు రోజుల క్రిందట ఒక లేఖ విడుదల చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి, ఏపి రాజధానుల విషయంలో తీసుకున్న నిర్ణయానికి జై కొట్టారు. మూడు రాజధానుల విషయంలో, జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా ఆలోచించారు అంటూ, చిరంజీవి ఒక లేఖ విడుదల చేసారు.
అయితే చిరంజీవి అభిమానులు మాత్రం, అది ఫేక్ లేఖ అంటూ ప్రచారం చేసారు. అంతే కాదు, అన్ని టీవీ చానల్స్ లో, ఈ విషయం పై చర్చ జరగటంతో, తమకు ఇబ్బంది కలుగుతుందని, గ్రహించి, ఒక ఫేక్ లెటర్ ని ప్రచారంలో పెట్టరు. ఆ లేఖలో, చిరంజీవి, ఆ లేఖ రాయలేదు అనే విధంగా పెట్టరు ‘‘యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది.. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏవిధమైన ప్రకటన చేయలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నాదృష్టి ఉంది. దయచేసి గమనించగలరు.. ’’ అంటూ ఒకే లేఖని ప్రచారంలో పెట్టరు.
అంటే చిరంజీవి, ఇలాంటి నిర్ణయాన్ని సహించారు, జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు అని, చిరంజీవి అభిమానులు నమ్మి, ఇలా చేసారు. అయితే చిరంజీవి మాత్రం, వీరి ఆలోచనలకు భిన్నంగా ఆలోచించారు. ఆ లేఖ ప్రచారంలోకి వచ్చిన వెంటనే, చిరంజీవి వివరణ ఇచ్చారు. ఒక ఆడియో మెసేజ్ ద్వారా, పత్రికలకు విడుదల చేసి, క్లారిటీ ఇచ్చారు. స్వయంగా చిరంజీవి మాట్లాడుతూ వచ్చిన ఆ ఆడియోలో ఇలా ఉంది. "రాజధానులను సమర్థించినట్లుగా శనివారం విడుదల చేసిన ప్రకటన మాత్రమే వాస్తవం. ఆదివారం (22.12.19) నా పేరుతొ వచ్చిన ప్రకటన అవాస్తవం. జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తున్నా" అంటూ చిరంజీవి ఆ ఆడియో మెసేజ్ లో స్పష్టం చేసారు.