జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీ బ్యానర్ ప్రజల్లోకి వచ్చిన అనతికాలంలో ఆయన అంతర్మథనం ఎవరికీ అంతుపట్టడం లేదు. పవన్ ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారని చిరంజీవి స్థాపించిన పార్టీ పిఆర్పీ కంటే చాలామెరుగ్గా ఉంటుందని రాజకీయ నేతలు ఊహించారు. ప్రత్యేక హోదా, కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిన నిధులు తదితర వ్యవహారాల పై కేంద్రంతో ఢీ కొనడానికి పవన్ ఏర్పాటు చేసిన జెఎఫ్ సి నేతలు పలుమార్లు సమావేశమై తీర్మానించిన అంశాలన్నింటినీ పవన్ ప్రక్కనపెట్టి జేఎఫ్ సి తీర్మాణాల ఊసే కన్పించకపోవడం, కేంద్రంపై పవన్ రాజీధోరణిలో వ్యవహా రిస్తూ టిడిపినే టార్గెట్ చేసుకోవడంపై జెఎఫిసీ తమ సీను పక్కదారి పట్టిందని సీనియర్ నేతలు పవన్ వ్యవహారం పై అసంతృప్తితో ఉన్నారు.
పవన్ పార్టీ స్థాపించి నాలుగేళ్లు అయినా ప్రజల్లోకి ఇటీవలే వచ్చారు. ఇక ఎన్నికలకు ఏడాది ఉండడంతో ఆ లోపు పవన్ రాజుకీయ ప్లాట్ఫారం ఏర్పాటుకు సమయం ఎంతకాలం పడుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. పవన్ కల్యాణ్ గత ఐదు నెలలుగా ఎపిలో పర్యటిస్తూ ఒక్కొక్క పర్యటన ఒక్కొక్క విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రకటనలు చేసి చివరికి కేంద్రాన్ని పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు సందిస్తున్న తరుణంలో పవన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. గత నెల రోజుల నుంచి ఉత్తరాంధ్రలో హడావిడి చేస్తున్నారు. గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి బాబును.. ప్రభుత్వ విధానాల పై నోరు మెదపని పవన్ ప్రస్తుతం చేస్తున ఆరోపణల పై పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతున్నట్లు స్పష్టం అవుతోంది. పవన్ ఏ నిమిషానికి ఏమి మాట్లాడతారో, ఆయన అవేశభరిత ప్రసంగం పై పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నింపుతోంది.
ఇక జనసేన పార్టీ అభాసుపాలు కాకుండా చిరంజీవి తెరపైకి వచ్చి, చివరి సీన్ లో పవన్ కల్యాణ్ కు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు పవన్ వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. చిరంజీవిని రాజాకీయంగా ఇబ్బంది పెట్టిన వారి అంతు చూస్తా అంటూ పవన్ పదే పదే అంటున్నారు. మరో పక్క చిరంజీవి ఫాన్స్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు, చిరంజీవి అభిమాన సంఘాలు, కాంగ్రెస్ నుంచి జనసేనలోకి వెళ్ళటం చూస్తుంటే, అంతా ప్లాన్ ప్రకారమే, జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే చిరంజీవి గతంలో వ్యవహరించిన తీరు, తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యటంతో చిరంజీవి పై ఏపి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
చివరి దశ లో చిరంజీవి తెరపైకి వచ్చినా, పవన్ వ్యవహరిస్తున్న తీరు పై ప్రజల్లో ఇప్పుడిప్పుడే వ్యతిరేకత ఎదురవుతోంది. చివరంజీవి తోడైతే, జోగి జోగి సామెత మిగులుతుంది. పవన్ వ్యవహారం పై ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థించడం లేదు. విభజన గాయాలు మనాక ముందే, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారు. ప్రస్తుతం పవన్ వ్యవహరిస్తున్న తీరు పై పీఆర్పీ అధినేత చిరంజీవినే మేలంటున్నారు ప్రజలు. ప్రజలను రెచ్చగోట్టటమే పనిగా పెట్టుకుని, ప్రజల మూడ్ అర్ధం చేసుకోకుండా, కేంద్రం పై పోరాడకుండా, రాష్ట్రం పై పోరాడటం చూస్తుంటే, పవన్ రాజకీయంగా రాణించడం అనుమానమేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.