ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిని కలవటానికి మేగాస్తార్ట్ చిరంజీవి, తాడేపల్లి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ కోసం, చిరంజీవి, సతీ సమేతంగా, హైదరాబాద్ నుంచి ప్రత్యెక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి జగన్ వద్దకు వెళ్తారు అని అందరూ అనుకుంటే, జగన్ తో భేటీ కంటే ముందు, చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. చిరంజీవి రాకతో, పవన్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు పెంచారు. అయితే జగన్ తో భేటీ కంటే ముందే, చిరంజీవి, పవన్ ని కలవటం వెనుక ఉన్న కారణం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. చిరంజీవి, జగన్ ను కలవటం, పవన్ కు ఇష్టం లేదు అనే ప్రచారం జరుగుతుంది. తనని రాజకీయంగా కాకుండా, వ్యక్తిగతంగా, నలుగురు నలుగురు పెళ్ళాలు అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన జగన్ పై, పవన్ గుర్రుగా ఉన్నారు. రాజకీయంగా ప్యాకేజ్ తీసుకున్నారని, ఇలా ఎన్ని మాటలు అన్నా, అవన్నీ రాజకీయంగా భాగం అని, కాని వ్యక్తిగతంగా తనని టార్గెట్ చెయ్యటం పై, పవన్, జగన్ పై గుర్రుగా ఉన్నారు.
మరో పక్క పవన్ కళ్యాణ్, కూడా జగన్ పరిపాలన పై, విమర్శలు చేస్తున్నారు. జగన్ వంద రోజుల పరిపాలన పై కూడా, ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి, జగన్ ప్రభుత్వం అన్నిట్లో విఫలం అయ్యిందని, జగన్ చెప్పే దానికి, చేసే దానికి, అసలు పొంతనే లేదని అన్నారు. ఇక మరో పక్క, జనసేన ఎమ్మెల్యే పై పెట్టిన కేసు విషయంలో కూడా, పవన్ కళ్యాణ్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. వీటి అన్నిటి నేపధ్యంలో, ఇప్పుడు చిరంజీవి వెళ్లి, జగన్ ను కలిస్తే, తనకు రాజకీయంగా ఇబ్బంది అని పవన్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, జగన్ తో కంటే భేటీ ముందే, చిరంజీవి, పవన్ ని కలిసి ఎందుకు జగన్ ని కలుస్తున్నామో వివరణ ఇచ్చి, పవన్ ని కూల్ చేసే ప్రయత్నం కోసం, పవన్ ఇంటికి వచ్చి, కలిసినట్టు చెప్తున్నారు.
ఈ పరిణామంతో, జనసేన కార్యకర్తలు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నా, పవన్ కళ్యాణ్ మాత్రం, ఇలా లంచ్ కు వచ్చి మరీ కలవటం ఎందుకు, అందరూ కలిసినట్టే సియంవో లో కలవచ్చు కదా అనే అభిప్రాయంతోనే ఉన్నారు. అయితే చిరంజీవి, జగన్ భేటీ, కేవలం సినిమా వరుకే పరిమితం అని చెప్తున్నారు. ఇందులో రాజకీయం అంశాలు ఉండవని అంటున్నారు. సాహో సినిమా స్పెషల్ షో కి పర్మిషన్ ఇవ్వకుండా, సైరాకి మాత్రమే స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు, జగన్ కు కృతజ్ఞతలు చెప్పి, తన సినిమా చూడామని కోరటానికే చిరంజీవి కలుస్తున్నారని చెప్తున్నారు. ఈ అవకాశాన్ని జగన్ తెలివిగా రాజకీయంగా వాడుకుని, పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేసేలా మంత్రాంగం నడిపారు. రాజకీయంగా ఈ భేటీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో, కాలమే నిర్ణయిస్తుంది.