చిరంజీవి ఏంటి, చంద్రబాబుని కలవటం ఏంటి అనుకుంటున్నారా ? అవును ఇది నిజం... చిరంజీవి చంద్రబాబుని కలిసి కృతజ్ఞత చెప్తానికి అమరావతికి వస్తాను అంటే, ఆయనను కొన్ని శక్తులు కలవనివ్వకుండా ఆపుతున్నాయి అని అంటున్నారు చిరంజీవి సన్నిహితులు... దీని అంతటకీ కారణం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాపులకి 5 శాతం రిజర్వేషన్ లు కల్పించటం... చంద్రబాబు ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్ లు ఇస్తారు అని చిరంజీవి భావించలేదు అని, అందుకే కాపు రిజర్వేషన్ ల అంశం పై ముద్రగడతో కూడా చిరంజీవి పదే పదే కలుస్తూ ఉండేవారు అని ఆయన సన్నిహితులు అంటున్నారు...
అనూహ్యంగా చంద్రబాబు కాపులకి రిజర్వేషన్ ప్రకటించటంతో, చిరంజీవి చాలా సంతోషించారు అని, 5 శాతం అయినా పెద్దగా ఇబ్బంది లేదు అని, అవసరమైతే పెంచమని తరువాత అడగవచ్చు అని, ఇప్పటికైతే ఈ నిర్ణయంతో ఎంతో మంది కాపుల్లో ఉన్న పేదలు లభ్ది పొందుతారని, అందుకే ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞత తెలిపి, ఢిల్లీలో కూడా ఆమోదం పొందేలా కృషి చెయ్యాలి అని ముఖ్యమంత్రిని అడగటానికి, అమరావతి బయలుదేరదాము అనుకున్నా, ఆయన వ్యవహారాలు చూసే అత్యంత సన్నిహితుడు అడ్డు పడ్డారని చెప్తున్నారు... ఒక పక్క పవన్ కళ్యాణ్ 15 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఉంటే బాగుంటుంది అని అంటుంటే, చిరంజీవి మాత్రం, ఈ విషయంలో సంతోషంగానే ఉన్నారు...
ఇదే విషయంలో చిరంజీవి, దాసరి నారాయణరావు చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకున్నారు అంట.. అప్పుడు దాసరి చెప్పిన మాటలు ప్రకారం ‘చంద్రబాబు మనస్తత్వం నాకు తెలుసు. అతను ఎవరితోనూ శత్రుత్వం కోరుకోడు. చెబితే వింటాడు. ఫ్లెక్సిబిలిటీతో వెళతాడు. తన పార్టీకి లాభం వస్తుందంటే ఏం కావాలన్నా చేస్తాడు. మనకిది కావాలని ఒత్తిడి చేస్తే వినే నైజం, వెసులుబాటు, స్వేచ్ఛ బాబు వద్ద ఉంది. మనకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత కొట్లాటలేవీ లేవు. ఆయన ఇస్తానన్న రిజర్వేషన్ల కోసమే పోరాడుతున్నాం. మంచిచేస్తే మెచ్చుకోవాలి. చెడు చేస్తే అడ్డుకోవాలి. ఇదే మన విధానంగా ఉండాలి. చంద్రబాబు గతంలో తన పార్టీకి మద్దతునిచ్చామన్న గౌరవంతోనో, భయంతోనో, భక్తితోనో కాపుల కోసం చేస్తున్న మంచి పనులు వాడుకోవాలి (కాపు కార్పొరేషన్ ఉద్దేశించి). అలా వాడుకోకపోవడం మన తప్పే. టిడిపిని, చంద్రబాబును కేవలం రిజర్వేషన్ల విషయంలో మాత్రమే వ్యతిరేకించాలి తప్ప, పథకాలను వాడుకోకపోవడం సరైంది కాదు. లేకపోతే నిధులు మురిగిపోయి మనవాళ్లే నష్టపోతారు’ అని దాసరి అన్న మాటలు చిరంజీవి గుర్తు చేసుకున్నారు అని ఆయన సన్నిహితులు అంటున్నారు... ఏదేమైనా చిరంజీవి అమరావతి రాకుండా అడ్డుకున్న ఆయన వ్యవహారాలు చూసే అత్యంత సన్నిహితుడి వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది...