తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నేతను కోల్పోయింది. టిడిపి సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ కొద్దిసేపటి క్రిందట కన్నుమూశారు. అయన గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నరు. గత కొద్ది రోజులుగా ఆరోగ్యం విషమించటంటి ఆయనకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన, ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. 24 గంటల తరువాత కూడా ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదు. శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించి, ఈ రోజు తుది శ్వాస విదిచారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించింది అని తెలుసుకున్న, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న చెన్నై వెళ్లి పరామర్శించారు.

sivaprasad 20092019 2

శివప్రసాద్ కొద్దిరోజులుగా మూత్ర పిండాల సమస్యతో బాధ పడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చెన్నైలో చికిత్స చేయించారు. సుమారు 10 రోజుల నుంచి ఆయనకు చెన్నై ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి, తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తాజాగా మరోసారి మూత్ర పిండాల్లో సమస్యలు రావటంతో, కుటుంబ సభ్యులు ఆయనను గురువారం ఉదయం మరోసారి చెన్నై ఆసుపత్రికే తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించిందని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు శివప్రసాద్ కుటుంబీకులకు ఫోన్ చేశారు. అధైర్య పడొద్దని అన్నారు. శివప్రసాద్ ను పరామర్శించడానికి తాను వస్తానని భరోసా ఇచ్చారు. నిన్న చెన్నై వెళ్లి పరామర్శించారు.

sivaprasad 20092019 3

చంద్రబాబుకు శివప్రసాద్ అత్యంత ఆప్తుడు. ఇద్దరిదీ ఒకే జిల్లా. మంచి స్నేహితులు కూడా. చంద్రబాబు ప్రోత్సాహంతోనే శివప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో శివప్రసాద్ ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డెప్ప రెడ్డిపై పోటీ చేసిన శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. అయితే శివప్రసాద్ డాక్టర్‌ కూడా... పార్లమెంటు సభ్యుడు... అంతకన్నా మించి ఆయన కళాకారుడు... అదే, ఆయనను రాజకీయాల్లోకి నడిపించింది... ఎంపీని చేసింది... ఢిల్లీకి పంపింది... విభిన్నమైన నాయకుడిగా దేశంలో ఆయనకు ప్రత్యేకమైన పేరు తెచ్చింది... లీడర్‌గా ఆయన పార్టీ గీత దాటరు. ఆయనలోని యాక్టర్‌ మాత్రం ఏ ఆంక్షలకూ బద్ధుడై ఉండడు... ప్రజా సమస్యలను వినిపించడానికి ఆయన పార్లమెంటునే రంగస్థలంగా మార్చేసుకున్నారు. సమస్య తీవ్రతను బట్టీ, సందర్భానుసారం వేషాలతో పార్లమెంటుకు హాజరవుతూ వచ్చే వారు. పద్యం, పాట, హరికథ, బుర్రకథ, బుడబుక్కల గలగల మాటలు.. తెలుగు కళారూపాలను ఢిల్లీలో పట్టంగట్టి చూపిన విలక్షణ నాయకుడు, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్‌.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధిస్తూ.

Advertisements

Advertisements

Latest Articles

Most Read