అతను డాక్టర్... పార్లమెంటు సభ్యుడు... అంతకన్నా మించి ఆయన కళాకారుడు... అదే, ఆయనను రాజకీయాల్లోకి నడిపించింది... మంత్రిని చేసింది... ఢిల్లీకి పంపింది... విభిన్నమైన నాయకుడిగా దేశంలో ఆయనకు ప్రత్యేకమైన పేరు తెచ్చింది... లీడర్‌గా ఆయన పార్టీ గీత దాటరు. ఆయనలోని యాక్టర్ మాత్రం ఏ ఆంక్షలకూ బద్ధుడై ఉండడు... ప్రజా సమస్యలను వినిపించడానికి ఆయన పార్లమెంటునే రంగస్థలంగా మార్చేసుకున్నారు. సమస్య తీవ్రతను బట్టీ, సందర్భానుసారం వేషాలతో పార్లమెంటుకు హాజరవుతారు. పద్యం, పాట, హరికథ, బుర్రకథ, బుడబుక్కల గలగల మాటలు.. తెలుగు కళారూపాలను ఢిల్లీలో పట్టంగట్టి చూపుతున్న విలక్షణ నాయకుడు, చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్..
ఇలాంటి పార్లమెంట్ సభ్యుడిని పట్టుకుని, జోకర్ అన్నారు, ఇద్దరు మనుషులు... నిజానికి వీరే పెద్ద జోకర్లు అని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు... ఒకడు సెక్స్ బొమ్మలు తీసుకుంటూ, సమాజాన్ని బ్రస్టుపట్టించే జోకర్... ఇంకొకడు, అందరూ నా దగ్గరకు వచ్చి, నాకు క్షమాపణ చెప్పాలి అనే ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న ఇంకో జోకర్... ఈ జోకర్ లు ఇద్దరూ కలిసి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆక్రోశాన్ని వినూత్నంగా, తనకు తెలిసిన కళా రూపంలో ఢిల్లీకి చాటిన పార్లమెంట్ సభ్యుడు జోకర్... మళ్ళీ దీనికి కులం రంగు కూడా పులుముతారు, ఈ జోకర్లు... మరీ ముఖ్యంగా, ఒక జోకర్ గాడు హైదరాబద్ లో, పని పాట లేకుండా టీవీల ముందు కూర్చుని, ఆంధ్రా పై విషం చిమ్ముతాడు... ఇంకో సెక్స్ పిచ్చోడు, ఏమి చేస్తాడో, ఆడికే తెలీదు...
ఈ ఇద్దరు జోకర్ల వ్యాఖ్యల పై, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్పందిచారు... తనను జోకర్ అన్నా పెద్దగా బాధపడలేదని, పేకాటలో జోకర్ కు ఎంత విలువ ఉందో తెలియదా? అని అడిగారు... పార్లమెంట్ లో 28 రాష్ట్రాల సమస్యలు వస్తుంటాయని, వాటన్నింటినీ పక్కన బెట్టి, అందరి దృష్టినీ ఏపీ వైపు తిప్పాలంటే, కేవలం ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తే సరిపోదని అన్నారు... అందరి దృష్టినీ ఆకర్షించేందుకు విభిన్నంగా ప్రవర్తించాల్సిందేనని అన్నారు. తాము రాష్ట్రం కోసం ఎంతో చేస్తుంటే, వర్మ కామెంట్లు ఏంటని ప్రశ్నించిన శివప్రసాద్, ఆయనిచ్చిన బిరుదులపై బాధపడటం లేదని, ఎవరు ఏమనుకున్నా తాను ఆగనని చెప్పారు. పనిలేని వర్మలాంటి వాళ్లు చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు...