సొంత భూములు సైతం ప్రభుత్వ భూములుగా రెవెన్యూ దస్త్రాల్లో నమోదు కావడంతో వాటిపై క్రయ.. విక్రయాలు లేక.. ఇతర రుణ సదుపాయం పొందలేక వందల మంది రైతులు నలిగి పోతున్నారు. ఇకపై అలాంటి రైతులకు వూరట లభించనుంది. ఎర్ర చుక్కలు ఉన్న భూములు ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించి వాటిపై రిజిస్ట్రారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను నిలిపి వేయడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడేవారు. ఇబ్బందుల సమయాల్లో వాటిని అమ్ముకోలేక.. కనీసం తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణాలు పొందలేక అవస్థలు పడేవారు. ఎంతోకాలంగా అన్నదాతలు ఈ సమస్యపై ఆవేదనకు గురవుతూనే ఉన్నారు. ఈ సమస్యకు చంద్రబాబు ముగింపు పలకనున్నారు. నిషేధిత భూముల జాబితా 22-ఏలో ప్రైవేటు ఆస్తులు, చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ కార్యాచరణ చేపట్టింది. గ్రామస్థాయిలోనే ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు జూన్‌ 13 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బుధవారం తెలిపారు.

cbn chukkalu 01062018 2

గతంలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమం కింద గ్రామసభలు నిర్వహించామని, ఇప్పుడు ఇదే తరహాలో 22-ఏ, చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తొలుత 22-ఏ నిషేధిత భూముల జాబితాను గ్రామస్థాయిలో పంచాయతీ కార్యాలయం లేదా రెవెన్యూ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అక్కడ వ్యక్తమయ్యే అభ్యంతరాలను రెవెన్యూ అధికారులు లిఖితపూర్వకంగా తీసుకుంటారు. అయితే, వారి వద్ద అప్పటికే మీ-సేవ ద్వారా ఇచ్చిన దరఖాస్తులు కూడా ఉంటాయి. వాటిపై కూడా అధికారులు జరిపే చర్చల్లో ప్రస్తావిస్తారు. రైతులు, ప్రైవేటు వ్యక్తుల అభ్యంతరాలను స్వీకరిస్తారు. దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన పూర్తయ్యాక.. ధర్మంగా ఉండే వాటిని అక్కడిక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కేఈ చెప్పారు. ఓ ప్రైవేటు ఆస్తి, లేదా ఓ భూమిని అన్యాయంగా 22-ఏలో చేర్చినట్లు నిర్ధారణ అయితే వెంటనే దాన్ని ఆ జాబితా నుంచి తొలగిస్తారు.

cbn chukkalu 01062018 3

గ్రామస్థాయిలో పరిష్కారం కాని వాటిని రాష్ట్ర కమిటీలు పరిశీలిస్తాయి. ఈ కమిటీలు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పరిష్కరిస్తాయి. దీనికి అనుగుణంగా కలెక్టర్‌ తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ రాష్ట్ర స్థాయి కమిటీలకు భూపరిపాలన శాఖ కమిషనర్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, సర్వే డిపార్టుమెంట్‌ శాఖ సీనియర్‌ అధికారులు నేతృత్వం వహిస్తారు. చుక్కల భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జిల్లా కమిటీల నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 90రోజుల్లో సీసీఏల్‌ఏకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇస్తాం. దీనిపై సీసీఏల్‌ఏ తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. 1954కు ముందు పేదలకు అసైన్డ్‌ చేసిన భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేఈ చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read