వైసిపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, చంద్రబాబు, నారాయాణ పై ఇచ్చిన ఫిర్యాదు పై, ఆ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మొన్న కోర్టులో జరిగిన వాదనల్లో ఎలాంటి ఆధారాలు సిఐడి ఇవ్వలేక పోవటంతో, అభాసుపాలు అయ్యింది. అంతే కాదు, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ లోని రైతులు కూడా, మేము కంప్లైంట్ ఇవ్వలేదు, మా దగ్గర సంతకం తీసుకుని వెళ్లి కేసు పెట్టారని, చెప్పిన సంగతి వీడియోతో సహా బయటకు వచ్చింది. దీంతో ఈ కేసులో ఏమి లేదని, కేవలం చంద్రబాబుని రాజకీయంగా ఇబ్బంది పెట్టటానికి, జగన్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాగా ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో ఎలాగైనా ఏదో ఒక చిన్న ఆధారం అయినా పట్టుకుని, చంద్రబాబుని దోషిగా నిలబెట్టటానికి, చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా గత రెండు మూడు రోజులుగా సిఐడి వేగంగా దర్యాప్తు చేస్తుంది. తన ఫోర్సు మొత్తం, ఈ కేసు మీదే పెట్టింది. దాదాపుగా 5 బృందాలు, ఇదే పనిలో ఉన్నాయి. కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాల విషయంలో సిఐడి ఏమి చేయలేకపోయిందని, కోర్టులే తిట్టిన సందర్భాలు ఉన్నాయి. న్యాయస్థానాల పై దుర్భాషలాడిన వారిని కూడా సిఐడి విచారణ చేయలేకపోయిందని కోర్టు కూడా చెప్పింది. ఇక రామతీర్ధం కేసు అడ్డ్రెస్ లేదు.

cid 28032021 2

ఇలాంటివి పట్టించుకోరు కానీ, ఎప్పుడో 2015లో జరిగిన దాని కోసం, రెండేళ్ళ నుంచి అధికారంలో ఉండి, ఏమి చేయలేని వాళ్ళు, ఇప్పుడు ఇలా ఇంత హడావిడి చేస్తున్నారు. ఒక్క ఆధారం కూడా లేకుండా, ఏకంగా చంద్రబాబు మీద కేసు పెట్టటంతో, ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పై అక్రమ కేసు పెట్టారని, మీడియాలో అల్లరి చేసే విధంగా నోటీసులు ఇచ్చారని, ఒక ఎమ్మెల్యే కేసు పెట్టమంటే, ఇలా చేస్తున్నారని, ఇది రాజకీయ కక్ష సాధింపు అంటూ, కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉందని, ఇప్పటికే ప్రకటించింది. దీంతో టిడిపి కోర్టుకు వెళ్ళే ముందే, ఏదో ఒక ఆధారం చూపించాలని, సిఐడి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా, ఎలాంటి ఆధారం చంద్రబాబు మీద కానీ , అప్పటి ప్రభుత్వం మీద కానీ దొరకలేదు. దీంతో ఎక్కువ బృందాలు పెట్టి, దాదాపుగా రాజధాని గ్రామాల్లో అసైన్డ్ భూమి ఉన్న అందరి దళిత రైతులని విచారణ చేసి, ఎక్కడో ఒక చిన్న లింక్ దొరికినా, చాలు అనుకునే విధంగా పైన నుంచి ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. అయితే టిడిపి మాత్రం, అక్రమ కేసులు పెట్టిన సిఐడి అధికారులు, చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read