అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబుకి సిఐడి నోటీసులు ఇవ్వటం, రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఒక పక్క, ఈ కేసు విషయం పై, హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే మరోపక్క ఈ రోజు కొంత మంది రైతులు, తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విచారణలో భాగంగా సిఐడి పోలీసులు, రైతులకు ఒక్కొక్కరికీ నోటీసులు ఇచ్చి, స్టేషన్ కు రమ్మన్నారని సమాచారం. దీంతో రైతులు స్టేషన్ కు వచ్చారు. వారి వద్ద నుంచి సిఐడి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. దాంట్లో భాగంగానే, నిన్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి నుంచి, నిన్న ఫిర్యాదు పై, ఆయన వద్ద నుంచి కూడా వివరాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు కొంత మంది రైతులని పిలిచి, వారిని విచారించారు. అందులో ప్రధానంగా, భూములు ఏ విధంగా తీసుకున్నారు, ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా, మీరు స్వచ్చందంగా ఇచ్చారు, ఈ భూములు కోనోగుళ్ళు ఏమైనా జరిగాయా, ఎవరు కొన్నారు లాంటి పలు ప్రశ్నలు, వారికి వేసి, సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే దీనికి కొంత మంది రైతులు సమాధానం ఇస్తూ, తాము స్వచ్చందంగానే భూమి ఇచ్చామని, తమను ఎవరూ బెదిరించలేదని, రైతులు సమాధానం చెప్పినట్టు చెప్పారు. ఇదే విషయం వారు బయటకు వచ్చి, మీడియాతో కూడా పంచుకున్నారు.

cid 19032021 21

అదే విధంగా, ప్రభుత్వం నుంచి రావలసిన పరిహారం కూడా తమకు అందిందని కొంత మంది రైతులు చెప్తూ, ఇదే విషయాన్ని సిఐడి అధికారులకు కూడా చెప్పినట్టు చెప్పారు. ఈ రోజు ఉదయం రైతులను, మరికొంత మందికి నోటీసులు ఇచ్చి , వారిని కూడా విచారణకు పిలిచినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని రైతులు, బయటకు వచ్చి మీడియాతో తెలిపారు. ఇక సిఐడి అధికారులు అప్పటి కీలక అధికారులను కూడా ఎంక్వయిరీ చేస్తున్నట్టు సమాచారం వస్తుంది. ఐఏఎస్ అధికారి, గతంలో గతంలో సీఆర్డీఏ కమిషనర్‍గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్‍ను సిఐడి విచారణకు పిలిచి, ఆయన్ను విచారిస్తుంది. ముఖ్యంగా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి, అప్పటి కీలక అధికారిగా ఉన్న శ్రీధర్ నుంచి కూడా , సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడకు వచ్చిన రైతులు ఎవరూ అప్పటి ప్రభుత్వం, చంద్రబాబు పై ఎలాంటి నెగటివ్ పాయింట్ చెప్పకపోగా, తాము లాభ పడ్డాం అని చెప్పటం, ఎలాంటి ఒత్తిడులు తమ పై లేవని, రాజధానికి మేమే భూములు ఇచ్చాం అని చెప్పటంతో, ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read