నరసాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు ఈ రోజు విచారణకు రావలిసిందిగా ఏపి సిఐడి హైదరాబాద్ లో ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో రాజద్రోహం కేసుకి సంబంధించి ఆయనను గతంలో అరెస్ట్ చేయడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, దానిపై మిలిటరీ హాస్పటల్ లో ట్రీట్మెంట్, తరువాత సుప్రీం కోర్టులో ఈ కేసుకి సంభందించి తదుపరి చర్యలు ఏమి తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారి చేయటం, ఇవన్నీ తెలిసిందే. అయితే ఈ FIR ను స్క్వాష్ చేయాలనీ కూడా రఘురామరాజు పిటీషన్ కూడా దాఖలు చేసారు. దీని పై కూడా విచారణ పెండింగ్ లో ఉంది. ఈ నేపద్యంలో ఈ కేసు పై విచారణకు ఈ రోజు రావలిసిందిగా ఆదేశాలు జారి చేస్తూ నోటీసులు ఇచ్చింది సిఐడి. అయితే ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, నోటీసులపై రఘురామ కృష్ణం రాజు సిఐడి కి లేఖ రాసారు. తాను ఢిల్లీకి అత్యవసర పని పై వెళ్ళాల్సి వచిందని అక్కడకు వెళ్ళిన తరువాత అనారోగ్య కారణాల వల్ల డాక్టర్ ను సంప్రదించాల్సిన పరిస్తితి వచ్చిందని ఆయన పెర్కొన్నారు. అదే విధంగా నోటీసుల్లో ఏదైతే సెక్షన్లు పేర్కొన్నారో ఆ FIR పై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేసామని, ఆ కేసు ఇప్పుడు విచారణలో ఉందని తెలిపారు రఘురామరాజు.
కోర్టులో ఉండగా, దీనికి సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం, ఆ పిటీషన్ విచారణలో ఉండగా ,ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కోర్ట్ పరిధిలోని అంశం కిందకు వస్తుందని అని కూడా పేర్కొన్నారు. అందుకని ఈ కేసు విచారణకు హాజరు అయ్యేందుకు తనకు 4 వారాలు సమయం కావాలని కూడా AP CID దర్యాప్తు అధికారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ కాపీని CID ADG కూడా ఆయన పంపారు. కొద్ది సేపటి క్రితం ఈ లేఖ CID కార్యాలయానికి పంపినట్టు ఇందులో పేర్కొన్నారు. ఇదే విషయం పై రఘురామరాజు మీడియా సమావేశం పెట్టి కూడా వివరించారు. అయితే దీని పైన సిఐది ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సిఐడి అధికారులు, రఘురామరాజు లేఖను ఒప్పుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. లేకపోతే ఏదైనా రూల్ చూపించి, ఢిల్లీకి వెళ్లి మరీ, ఆయన్ను అరెస్ట్ చేసి, మళ్ళీ గుంటూరు తీసుకుని వస్తారా అనేది చూడాల్సి ఉంది. దీని పైన సిఐడి ఎలా స్పందిస్తుంది, దానికి రఘురామరాజు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.