రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూములు విషయంలో అవకతవకలు జరిగాయి అంటూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మాజీ మంత్రి నారాయణకు, సిఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులుకు సంబంధించి, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు, ఈ కేసు నమోదు అయినట్టు, దాని పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దానికి వివరణ ఇవ్వాలంటూ, చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ ఫిర్యాదులు అనేక లోటు పాట్లు ఉన్నాయి అంటూ, నిన్నటి నుంచి మీడియాలో కధనాలు వస్తున్నాయి. అలాగే న్యాయ నిపుణులు కూడా ఇదేమి కేసు, ఇవేమీ సెక్షన్లు, కోర్టులో చీవాట్లు తప్పవు అంటూ విశ్లేషించారు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ లోటు పాట్లు విషయం పై కోర్టుకు వెళ్ళటానికి సిద్ధం అయ్యింది. ముఖ్యంగా ఆ ఎఫ్ఐఆర్ లో, ఎమ్మెల్యే ఆర్కే కు, కొంత మంది రైతులు, కొంత మంది మధ్యవర్తలు లబ్ది పొందారని, కొంత భూమి పై ఫిర్యాదు చేసినట్టు, దీంతో ఎమ్మెల్యే సిఐడికి ఫిర్యాదు చేసినట్టు, దాని పై సిఐడి ప్రాధమిక దర్యాప్తు చేసి, కేసు నమోదు చేసినట్టు ఉంది. అయితే అసలు ఎవరా కొంత మంది రైతులు, వారి పేర్లు ఏమిటి, వారు ఊరు ఏమిటి ? నష్టపోయిన రైతులు పేర్లు ఏమిటి ? ఏ గ్రామంలో భూమి ? మధ్యవర్తలు ఎవరు ? ఇలా ఏమి చెప్పకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రి పై కేసు పెట్టటం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు సిఐడి చేసిన ప్రాధమిక విచారణ ఏమిటి ? ఏ ప్రాతిపదికిన చేసారు అనే దాని పై కూడా చర్చ జరుగుతుంది. రేపు చంద్రబాబు కోర్టుకు వెళ్తే, ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే, సిఐడి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఎమ్మెల్యే ఆర్కే కు సిఐడి నోటీసులు ఇచ్చింది. రేపు 11 గంటలకు విజయవాడలో ఉన్న సిఐడి కార్యాలయానికి రావాలని, మీ దగ్గర ఉన్న ఆధారాలు, అన్ని వివరాలు తమకు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పీసి కింద నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, నారాయణ, ఇతరులు పై చేసిన ఆరోపణల విషయంలో ఆధారాలు ఇవ్వాలని కోరారు. అయితే ఇక్కడే తెలుగుదేశం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఇప్పటి వరకు, ఎలాంటి ఆధారలు ఆళ్ళ నుంచి తీసుకోకుండా, కేవలం ఫిర్యాదు ఇవ్వగానే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎలా కేసు పెట్టి, ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎలాంటి విచారణ సిఐడి చేసిందని ? ఆళ్ళ నుంచి ఆధారాలు తీసుకోకుండా కేసు పెట్టి, నోటీసులు ఇచ్చి, ఇప్పుడు ఆళ్ళని ఆధారాలు ఇవ్వమని అడగటం ఏమిటి అంటూ, తెలుగుదేశం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. దీని పై కోర్టులోనే తేల్చుకుంటాం అని చెప్తున్నారు.