తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా, మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ లో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి, సిఐడి నమోదు చేసిన కేసులో, ఈ కేసులో నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు ఇచ్చిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ రోజు ఉదయం 10.20 గంటలకు కృష్ణా జిల్లా, గొల్లపూడిలో ఉన్న దేవినేని ఉమా నివాసానికి వచ్చిన సిఐడి పోలీసులు ఈ నోటీసులు అందించారు. అయితే ఉదయం 1030 గంటలకు కర్నూల్ లోని సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలి అంటూ, ఆ నోటీసులో సిఐడి అధికారులు పేర్కొన్నారు. అయితే కృష్ణా జిల్లాలో ఉదయం 10.20 గంటలకు నోటీసులు ఇచ్చి, నెల్లూరు జిల్లా ఎన్నికల ప్రచరంలో ఉన్న దేవినేని ఉమాని, ఉదయం 1030 గంటల కల్లా కర్నూల్ రావాలని నోటీసుల్లో పేర్కొనటం పై, అందరూ షాక్ తిన్నారు. అసలు పది నిమిషాలలో, ఎలా విచారణకు వస్తారని ? కనీసం విజయవాడలో ఉన్నా పది నిమిషాల్లో రావటం కుదరదు కాదా, అసలు ఇది ఎలా సాధ్యం అనుకుని, ఈ పని చేసారు అంటూ తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. అరాచకానికి, ఇది మరో మెట్టు అని వాపోతున్నారు. ఇంతకంటే అరాచకం ఎక్కడా ఉండదు అనుకున్న ప్రతి సారి జగన్ మోహన్ రెడ్డి, అంతకు మించి చేస్తున్నారని వాపోతున్నారు.

uma 15042021 2

అయితే దేవినేని ఉమా ఆరోపణలకు సంబంధించి, కర్నూల్ లో ఉండే నారాయణ రెడ్డి అనే అడ్వొకేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఈ కేసు నమోదు చేసినట్టు, సిఐడి పేర్కొంది. సెక్షన్ 464, 465, 468, 469, 470, 471, 505, 120(బీ) కింద కేసులు పెట్టారు. ఇక ఈ కేసు విషయానికి వస్తే, జగన్ మోహన్ రెడ్డి 2014 మ్యానిఫెస్టో సమయంలో మాట్లాడుతూ, తిరుపతిని కించపరిచారు అనేది టిడిపి వాదన. ఆ రోజు జగన్ మాట్లాడుతూ ""ఎందుకు ఒక మంచి సిటీ ఉండాలి, ఒక మహా నగరం ఉండాలి అంటే దానికి కారణం ఉంది. కారణం ఏమిటి అంటే, ఇవాళ, ఇక్కడ ఉన్న ఎవరిని అయినా కూడా, నేను వచ్చి తిరుపతిలో మీరు ఉండండి అంటే ఎవరూ రారు. మీలో ఎవరిని అయినా కూడా, మీరు వచ్చి పలనా చోట ఉండండి అంటే ఎవరూ ఉండరు. ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ అయినా కూడా, ఏ గొప్ప చదువులు చదివిన వ్యక్తీ అయినా కూడా హైదరాబాద్ లో ఉండటానికి ఇష్ట పడతాడు, బెంగుళూరు లో ఉండటానికి ఇష్ట పడతాడు, బొంబాయిలో ఉండటానికి ఇష్ట పడతాడు, ఢిల్లీలో ఉండటానికి ఇష్ట పడతాడు కానీ ఏ వ్యక్తి కూడా, ఒరిస్సాలో ఉండటానికో, బీహార్ లో ఉండటానికో, లేదా తిరుపతిలో ఉండటానికో ఇష్టపడరు. కారణం, ఆ వ్యక్తికి తను ఓన్ చేసుకునే ఒక గొప్ప సిటీ ఒకటి ఉండాలి " అంటూ తిరుపతి పై మాట్లాడారు. అయితే దేవినేని ఉమా పోస్ట్ చేసిన వీడియోలో, ఆడియో మాత్రం ఇదే ఉన్నా, వీడియో వేరుగా ఉందని, కేసు నమోదు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read