తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నేపధ్యంలో, మాజీ మంత్రి దేవినేని ఉమా, జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ, నారాయణ రెడ్డి అనే అడ్వొకేట్ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేయటం జరిగింది. ఈ మేరకు సిఐడి అధికారులు, రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసారు. అయితే ఆ నోటీసులు కొంత వివాదస్పదానికి దారి తీసాయి. మొన్న నోటీసులు జారీ చేసిన సమయంలో ఉదయం పది గంటల సమయంలో బెజవాడలోని ఇంటికి నోటీసులు ఇచ్చి, తిరుపతిలో ఉన్న దేవినేని ఉమాని, కర్నూల్ కు 10.30 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వటం జరిగింది. అయితే దానికి దేవినేని ఉమా తిరిగి ఒక లేఖ రాసారు. అసలు పది నిమిషాల్లో, విచారణకు రావటం ఎలా సాధ్యం అని దేవినేని ఉమా ప్రశ్నించారు. పెద్ద ఎత్తున దీని పై విమర్శలు వచ్చాయి. దేవినేని ఉమా కూడా దీని పై, సిఐడికి లేఖ రాసారు. తాను పార్టీ ఆదేశాల మేరకు, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాను, క-రో-నా సంరక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నాను కావున, నాకు పది రోజులు సమయం కావాలని దేవినేని ఉమా, సిఐడికి లేఖ రాసారు. ఈ లేఖని సిఐడి అధికారులకు కూడా దేవినేని ఉమా అందించారు. అయితే ఇప్పుడు మరోసారి సిఐడి అధికారులు, దేవినేని ఉమాకు నోటీసులు ఇవ్వటంతో, మళ్ళీ చర్చకు దారి తీసింది.
ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో, రెండో నోటీసు దేవినేని ఉమాకు సిఐడి అందచేసింది. ఆయన నివాసం ఉన్న గొల్లపూడిలో, ఈ నోటీసులు అంటించారు. ఈ నోటీసులో ప్రధానంగా చూస్తే, ఈ నెల 19వ తేదీన, 10.30 గంటలకు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని దేవినేని ఉమకు నోటీసులు జారీ చేసారు. అయితే దీనికి రిప్లై గా దేవినేని ఉమా మరో లేఖ రాస్తారా, లేదా విచారణకు హాజరు అవుతారా అనేది చూడాల్సి ఉంది. అయితే మొన్నటి దాక ఇరిగేషన్ లో లక్షల కోట్లు ఉమా దోపిడీ చేసారు, ఆయన్ను ఆధారాలతో పట్టుకుంటాం, జైలుకు పంపిస్తాం అని చెప్పిన వైసీపీ నేతలు, ఇలా జగన్ మోహన్ రెడ్డిని తిట్టారని కేసులు పెట్టి, నోటీసులు ఇచ్చి, చివరకు అరెస్ట్ చేసే ప్లాన్ వేసారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వీడియోలో, జగన్ మోహన్ రెడ్డి తిరుపతిని కించపరిచినట్టు ఉందని, వీడియో మారినంత మాత్రాన, జగన్ మోహన్ రెడ్డి ఆ మాటలు అనలేదు అని చెప్పగలరా అంటూ, ఒరిజినల్ వీడియో చూపించి కౌంటర్ ఇస్తున్నారు. మరి సిఐడి ఏమి చేస్తుందో చూడాలి...