విడి పోయిన రాష్ట్రానికి, రాజధాని లేదని, మన రాష్ట్రానికి ఒక ప్రపంచ స్థాయి రాజధాని కావాలని, చంద్రబాబు లాంటి సమర్ధుడు ఉన్నాడని నమ్మి, అమరావతికి చెందిన 27 గ్రామాల రైతులు, 33 వేల ఎకరాల భూమి, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక సెంట్ భూమి కోసం, రణరంగాలు జరుగుతున్న వేళ, ఏకంగా 33 వేల ఎకరాలు, ఒక వ్యక్తిని నమ్మి ఇవ్వటం చూసి, ప్రపంచమే ఆశ్చర్య పోయింది. వివిధ రాష్ట్రాలు వచ్చి, ఈ ల్యాండ్ పూలింగ్ నమూనా పై తెలుసుకుని వెళ్ళాయి అంటే, ఇది ఎంత సక్సెస్ అయ్యిందో తెలుసుకోవచ్చు. రైతుల నమ్మకాన్ని నిలబెడుతూ, అమరావతి పనులు చంద్రబాబు మొదలు పెట్టరు కూడా. అమరావతిలో ఎక్కడ చూసినా నిర్మాణాలే కనిపిస్తూ ఉండేవి. దాదపుగా 30 వేల మంది కార్మికులు పని చేస్తూ ఉండేవారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, మొత్తం తారు మారు అయ్యింది.

amaravati 12102019 2

ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. కార్మికులు అందరూ వెళ్ళిపోయారు. అయితే జగన్ ప్రతిపక్షంలో ఉండగా, అమరావతి పై అనేక ఆరోపణలు చేసారు. అమరావతి నిర్మాణం అంతా పెద్ద స్కాం అని, దీని వెనుక ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు ఆయన బినామీలు, వేల ఎకరాలు కొనేసి, ఇక్కడ రాజధాని పెట్టారని, అనేక ఆరోపణలు చేసారు. ప్రజలు ఈ ఆరోపణలు నిజం అని నమ్మేలా, ప్రాచారం చేసి, సక్సెస్ అయ్యారు. అయితే జగన్ ప్రభుత్వంలోకి వచ్చి, నాలుగు నెలలు అయ్యింది. నాలుగు నెలల నుంచి, ఎంత తవ్వినా, ఎక్కడ ఒక్క ఆధారం కూడా, అమరావతిలో స్కాం జరిగినట్టు దొరకలేదు. ఎన్ని ఎంక్వయిరీలు వేసినా, ఎక్కడా అవినీతి జరిగినట్టు కనిపించటం లేదు. దీంతో ఇప్పుడు సిఐడిని రంగంలోకి దించింది ప్రభుత్వం.

amaravati 12102019 3

దీంతో సిఐడి రంగంలోకి దిగింది. గత 5 ఏళ్ళుగా, అమరావతిలో భూములు అమ్మిన రైతుల ఇళ్ళకు వెళ్ళారు సిబిఐ అధికారులు. భూములు ఎవరికీ అమ్మారు ? ఇంతకు అమ్మారు ? అనే విషయాల పై రైతుల ఇళ్ళకు వెళ్లి ఆరా తియ్యటంతో, అక్కడ రైతులకు అలజడి మొదలైంది. ప్రశాంతంగా బ్రతుకుతున్న మాకు, ఈ టెన్షన్ లు ఏంటి అంటూ రైతులు వాపోతున్నారు. అమరావతి రాజధాని అయిన తరువాత, కేవలం 180 ఎకరాలేనని అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అవి కూడా అమ్మింది, కొనింది అంతా సామాన్యులే. అయితే వారు సామాన్యులు కాదని, టిడిపి బినామీలు అంటూ, ఏదో ఒక లింక్ చూపించి, అది టిడిపికి, చంద్రబాబుకి తగిలించాలని చూస్తున్నారు. అయితే, ఎంత చూస్తున్నా, ఎక్కడా అవినీతి ఆనవాళ్ళు కనిపించటం లేదు. అయితే తమా రాజకీయం కోసం, మమ్మల్ని బలి చెయ్యటం ఏంటని, మేము సామాన్య రైతులమని, మా ఇళ్ళకు సిఐడి అధికారులు వస్తే, గ్రామాల్లో మా పరువు ఏమి కావాలని, రైతులు వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read