సిఐఐ సమ్మిట్ కు వచ్చిన ఫారన్ డెలిగేట్స్, విశాఖ స్వచ్ఛత చూసి ఫిదా అయిపోయారు... కాలిఫోర్నియా నుంచి, జపాన్ నుంచి, కొరియా నుంచి, స్పెయిన్ నుంచి, ఇలా వివిధ దేశాల ప్రతినిధులు, క్లీన్ గా ఉన్న విశాఖ నగరాన్ని చూసి, పొగడకుండా ఉండలేక పోయారు... వారి మాటల్లో, "George O’Neal from California. “During my drive to the hotel from the airport, I found Vizag to be a clean and green city. There’s no much natural beauty around, there are hills, forests and seas. Driving on the roads back home in California is a nice experience, and it’s a similar feel when you drive on Vizag roads"
Steel Lee from South Korea, who is the director of Daeha Co, was also struck by the city’s cleanliness. “It’s a good place for business. After the conference, we hope to do some sightseeing around the city and will go to the beaches. We are also interested in setting up our manufacturing unit in Andhra Pradesh,”
విభజన తరువాత, విశాఖను నవ్యాంధ్ర వెన్నుముకగా చెయ్యటానికి చంద్రబాబు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. స్వచ్ఛభారత్ మిషన్‌లో ర్యాంకింగ్స్ లో దేశంలోనే 3వ ర్యాంకులో నిలిచింది. దేశంలోనే ఎల్‌ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించింది. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ రివ్యూ, బ్రిక్స్ సదస్సు , భాగస్వామ్య సదస్సుతో విశాఖకు ప్రంపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ఏకంగా, మూడో సారి ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు కు ఆతిథ్యం ఇచ్చి, నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని మరోసారి నిరూపించింది... మన నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని ఇలాగే సుందర నగరంగానే ఉండాలి.... పెట్టుబడులు రావాలి... ఎదుగుతూనే ఉండాలి... నవ్యాంధ్ర ప్రగతిలో భాగస్వామి కావలి...